Nenu, Poolan Devini

Editor · History

Nenu, Poolan Devini book cover

Price: Rs. 250. 'నా సాహస కార్యాల్ని కొనియాడు నా వీర గాథల్ని గానం చెయ్యి నా తప్పిదాల్ని మన్నించు నాపై శాంతి వర్షం కురిపించు -ఫూలన్దేవి చేసిన ప్రార్ధన ఇది. ఆమె స్వయంగా చెప్పిన తన యదార్థ జీవిత గాథే ఈ పుస్తకం. యావద్దేశ చరిత్రలోనే ఓ గొప్ప మహిళా బందిపోటుగా, లివింగ్ లెజెండ్గా పేరు గాంచింది. చంబల్లోయలో పసిపిల్లగా వున్నప్పుడే కులవ్యవస్థ దౌష్ట్యాన్నీ, బీదల భూమి హక్కులు కాలరాయబడటాన్నీ, తనకంటే ఎంతో పెద్దవాడైన వ్యక్తితో పెద్దలు చేసిన పెళ్ళి వల్ల ఎదురైన చేదు అనుభవా లని ఫూలన్ దేవి చవిచూసింది. ఒక బీద నిమ్నకుల స్త్రీకి జరుగుతున్న అవమానాన్ని చూసి సహించలేకపోయినందు వల్ల ఆ బందిపోట్ల ముఠాకి తనే నాయకత్వం వహించవలసి వచ్చింది. 1983 లో ప్రభుత్వానికి లొంగిపోయిన పిదప దినదిన గండంలా గడచిన జైలు రోజులు, కందిరీగల్లా చుట్టుముట్టిన కోర్టు కేసులు, 'సమాజ్వాది పార్టీ'లో రంగప్రవేశం చేయడం, చివరికి దేశ రాజధానిలోనే 2001 జులై 25న హత్యకు గురికావడం తదితర పరిణామాలన్నీ దేశవ్యాప్తంగా సంచలన చర్చ రేపాయి. ఒక స్త్రీ బందిపోటుగా ఎలా రూపాంతరం చెందింది అనే అంశానికి సంబంధించిన అసాధారణ జీవిత చిత్రణని పుస్తక రూపంలో మీ ముందుంచుతున్నాం. ఇందులో ఫూలన్దేవి జీవితంతోపాటు వర్తమాన భారతదేశపు స్థితిగతులు ఎలా వున్నాయి? భారతదేశం తన గ్రామాల్లో తను ఎలాంటి బతుకును గడుపుతోంది? పోలీసు, న్యాయం, కార్యనిర్వాహక, శాసనసభ తదితర రాజ్య వ్యవస్థలు ఏ విధంగా విఫలమవుతున్నాయి... మొదలైన అంశాల విశ్లేషణ కూడా వుంది.

Browse more Telugu books