Nenu- Na Amaravathi
Editor · Politics

Price: Rs. 225. ఆనాటి కథ మహాభారతంలో ఏకచక్రపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరి పొలిమేరల్లో బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు ఊరి జనులను వేధించే వాడు. చంపి తినేవాడు. వాడి రాక్షస ఆకలికి భయపడి ఊరి జనులు శరణు కోరారు. రోజూ ఇంటికో మనిషి, రెండు దున్నపోతులు, బండెడు బువ్వ పంపుతామని అర్థించారు. మూడింటినీ పంపేవాళ్ళు. వాడు ఆహారంగా ఆరగించే వాడు. ఈనాటి గాధ | భారతదేశ చరిత్రలో అమరావతి అనే రాజధాని ఉండేది. ఆ రాజధాని ఉన్న రాష్ట్రానికి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అతడు అమరావతికి అగ్గి పెట్టాడు. విభజన ఆజ్యం పోశాడు. మహిళలను చెరలు పెట్టాడు. రైతుల్ని నరకయాతనలకు గురి చేశాడు. ఆయన బాధలు భరించలేక రాజధాని రైతులు ఉద్యమం చేశారు. ఆకుపచ్చని కండువాలు | విల్లంబుల్లా ఎక్కు పెట్టారు. 'వినాశనం' ఎక్కువ రోజులు బతకలేదు. ఏకచక్రపురం రక్షణకు దేవ దేవుడు భీమసేనుడి అవతారం ఎత్తాడు. అమరావతి రక్షణకు భగవానుడు రాజధాని మహోద్యమం అయ్యాడు. బకాసురుడిపై భీముడు గెలిచాడు. జగన్మోహన్ రెడ్డిపై రైతులు గెలిచారు.