Nenu Mouna Prekshkuni kaanu

arun / అరుణ్‌ · Politics

Nenu Mouna Prekshkuni kaanu book cover

Price: Rs. 108. 80 సంవత్సరాల స్టాన్స్వామి అంటే ఇండియా ఎందుకంత భీతిల్లింది? ఎంత భయపడిందంటే పూణే నుండి పోలీసులను రెండుమార్లు పంపి అతడి గదిపై దాడి చేసి అతని కనీస వస్తువులను జప్తు చేశారు. మొదట కేంద్ర బిజెపి ప్రభుత్వం పూణే పోలీసులతో కలిసి అతనిని భీమా కొరేగావ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. స్టాన్స్వామి ధైర్యశాలి, అన్యాయాన్ని ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రశ్నించే వ్యక్తి. అందుకే ప్రభుత్వానికి అతనంటే భయం. - డా. నందినీ సుందర్ ఆయన తరచుగా ఆనాడు రోమన్ సామ్రాజ్యానికి జీసెస్ సత్యాన్నే చెప్పేవాడని అనేవారు. అటువంటి సద్గుణాన్ని మనం అనుకరించాలనే వారు. మత సంబంధమైన సాంప్రదాయాలను గౌరవించాలని చెబుతూ, వాటి బయటి స్వరూపాల్ని అధిగమించి చూడాలనేవారు. ఆ విధంగా, సామాజిక, సామూహిక సారాన్ని అర్థం చేసుకోవాలనేవారు. పై వెలుగులో ఆదివాసీ సమాజానికి, సమూహానికి ప్రథమ ప్రాధాన్యత ఉందని స్టోన్ భావించారు. సామాజిక మార్పుకు, ప్రజా పోరాటాల కేంద్ర యంత్రాంగాన్ని విశ్లేషించడానికి మార్క్సిస్టు పరికరాలు చాలా తగినవని స్టాన్ కనుగొన్నారు. - అరుణ్ ఫరేరా

Browse more Telugu books