Nenika Yuddhalu Cheyyanu! Ika Sainikudiga Undanu!
Ranganayakamma / రంగనాయకమ్మ · Novels

Price: Rs. 75. "ఇందాక, ఆ సందులోనించి వస్తావుంటే, అక్కడ గుడిసెలూ, పాకలూ చూస్తే, కళ్ళాపు జిమ్మే పిల్లనీ, ఏదో కూరాకుల కోసం U వొంగి వొంగి నడుస్తూ పోయే మామ్మనీ, తల్లిని వదిలేసిన కొడుకునీ, అలా అవన్నీ చూస్తా, వింటా వుంటే, అక్కడే వుండి, వాళ్ళతో పాటే వుండి, వాళ్ళకి సాయాలు చేస్తూ, అక్కడే ఆగిపోదామా అనిపించిందమ్మా, నమ్మండి! ఆ తప్పుడు కొడుకుని నా బలంతో తన్ని, తెచ్చి, తల్లి ముందు పడేద్దామా అనిపించింది. ఈ పనులు చెయ్యాలి గానీ, యుద్ధాలెందుకు? తుపాకులెందుకు? దేశ సేవా, వల్లకాడా - అనిపించిందమ్మా!” “సైనికులందరూ నిరుపేద కుటుంబాల వాళ్ళమ్మా! 'దేశ 'సేవ' అని మాట్లాడే వాళ్ళు చాలా మందే వుంటారు గానీ, సైన్యం లోకి చేరే వాళ్ళు ధనవంతుల పిల్లలెవరైనా వుంటారా? ఉంటే, వాళ్ళు పెద్ద హోదాలలో వుంటారు, ఆఫీసర్లుగా. పేదవాళ్ళనే తుపాకుల ముందు పెడతారు”. “ఒక సైనికుడి మరణంతో అతని కుటుంబం నాశనం అయిపోతుంది. మరణించిన సైనికుడికి ప్రభుత్వం ఒక 'బిరుదు' ఇస్తే, ‘వీర, సాహస, త్యాగ ధనుడు' అంటూ రాస్తే, కొంత డబ్బు పడేస్తే, ఏమిటి ఆ వీరుడికి దక్కేది?” “నిన్ను ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే, రేపు ఒక తుపాకీ దెబ్బతో నేల కరుస్తావు. నువ్వు కరవకపోయినా ఇంకోణ్ణి నేల కరిపిస్తావు. ‘మంచి పని' అంటే అదా? నీ వల్ల ఎవరన్నా చస్తే, నీకు తిండెక్కుతుందా, నిద్ర పడుతుందా? అలాంటి నీతో నేనెలా వుంటాను?' - అంటుంది. 'వాడు శతృవు కదా?' అని నేనంటే, 'నువ్వూ వాడికి శతృవ్వే. ఏం తప్పు చేశావు, శతృవుగా అవటానికి నువ్వు?' అంటుంది.