Neeti Needa / నీటి నీడ

Koora Chidambaram / కూర చిదంబరం · Books

Neeti Needa / నీటి నీడ book cover

Price: Rs. 135. సమాజంలో మనమధ్యన తిరుగుతూ ఉన్న అనేక మంది చిత్ర విచిత్ర మనుషుల కథల్నీ, గాథల్నీ ఒడిసిపట్టి తమ ఇతివృత్తాల్ని చేసుకున్నారు చిదంబరం గారు. అందుకనే సంపుటిలోని కథలన్నీ ఈనాటి సామాజిక సందర్భాల్నీ, ఆ సందర్భాల్లో అతలాకుతలమౌతున్న మనుషుల్నీ ఆవిష్కరిస్తున్నాయి. - విహారి ఆ మానవీయభావనలకు ప్రోది కల్పిస్తూ, అమానవీయ భావనలను నిరసిస్తూ, సమాజాన్నీ, సమాజంలోని వివిధ వ్యక్తుల మనస్తత్వాలను మన కనుల ముందుంచుతూనే – 'ఇలా అయితే ఎలా' అంటూ సున్నితంగా హెచ్చరిస్తూనే, ఒక గుణాత్మక దిశగా మన ఆలోచనలను మలచే రచనాభినివేశాన్ని సాక్షాత్కరింపచేశారు రచయిత. - సుధామ పుస్తకం ఒకసారి తెరిస్తే చివరి వరకూ పాఠకుడు పుస్తకం దించకుండా చదువుతాడని ఖచ్చితంగా చెప్పను. ఎందుకంటే ప్రతి కథా, పాఠకుడిని ఉత్సాహంగా చదివిస్తుంది. ఆ తరువాత కొన్ని క్షణాలైనా (కనీసం) పాఠకుడిని ఆలోచింపచేస్తుంది. వారు ఛార్టెర్డ్ ఎక్కౌంటెంట్. అందుకే పైసలో వెయ్యోవంతు తేడా కూడా రాకుండా కథల్ని “చిత్రీకరించారు”. చిత్రీకరణ అనే మాట ఎందుకంటే కళ్ళు అక్షరాల మీద పరిగెడుతూంటే, మనసు తానే ఓ సెల్యులాయిడ్ (వెండితెర) లా మారి, మనకి ఆ కథని సినిమాగా చూపుతుంది. చాలా చాలా కాలం తర్వాత ఏ మాత్రం కల్తీ లేని కథల్ని చదివానన్న ఆనందంగా వుంది. - భువన చంద్ర

Browse more Telugu books