Naxalism Naakem Nerpindi?

జి. రాములు / G .Ramulu · Books

Naxalism Naakem Nerpindi? book cover

Price: Rs. 180. కామ్రేడ్ రాములు రాసిన ఈ గ్రంథం స్వాతంత్య్రం వచ్చిన రోజులలో పుట్టి పెరిగిన యువకుల ఆలోచనా విధానాన్ని తెలియచెప్తుంది. ఆ తరం యువకులు ప్రజాస్వామిక మార్పులు త్వరగా జరగాలంటే విప్లవం రావాల్సిన అవసరముందని ఆలోచించారు. అప్పటికి కమ్యూనిస్టులలో ఉండి స్వీయ విభేదాలతో విడిపోవడం ఒకరిపై ఒకరు పెద్ద విప్లవకారులం అని నిరూపించుకోవడానికి పార్టీలు పెట్టడం మొదలైంది. అందులో భాగమే నక్సలిజం. యూనివర్శిటీలలో చదువుతున్న విద్యార్థులు 1970ల నాటికి అసంతృప్తి చెంది నక్సలిజం బాటపట్టడం వల్ల అది పెద్ద ఉద్యమంగా మారింది. అది సాయుధ పోరాటంగా మారింది. జి.రాములు వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగినవాడు. వరంగల్ జిల్లా రాజకీయం, పెత్తందారి కులాల క్రిందకి వెళ్ళి ప్రజల జీవితంలో మార్పు రాకుండా చేసింది. ఆనాటి జాతీయ రాజకీయాల్లోకి కులరాజకీయాలు ప్రవేశించి యువకులలో ఆశించిన పద్ధతిలో ప్రజాస్వామ్య భావాలు ఏర్పడలేదు.

Browse more Telugu books