Navvi Podhurugaka...
Editor · History

Price: Rs. 585. మురారి భావకుడైన నిర్మాత. కవితో కూర్చొని అద్భుతమైన సందర్భాన్ని సృష్టించి, దానికి తగిన సాహిత్యాన్ని రాయించుకున్న మురారి సంస్కారానికి నా నమస్కారాలు. నా కృతజ్ఞతలు.... S.P. బాలసుబ్రమణ్యం ఇది స్వీయ చరిత్రలా అనిపించే సామాజిక చరిత్ర. కధనంలా కనిపించే బాహ్యాంతర మథనం. ఇందులో రచయితే కాదు, సమకాలిక ప్రపంచమూ దిగంబరమై అగపడుతుంది. అది 'ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి, కన్పించని కథలెన్నో' వినిపిస్తుంది. అది మనల్ని మురిపిస్తుంది. వెరపిస్తుంది. - డా. పాపినేని శివశంకర్ స్వారోచిషమను సంభవం, వసుచరిత్ర లాగా ఇదొక దృశ్య కావ్యం నేరము-శిక్షలాగా ఇదొక నవల. ఇక్కడ భూస్వామి, పాలేరు ఒక్కడే... లయ అతడే, ప్రళయం అతడే, సురుడు వాడే, అసురుడు వాడే అతడే మురారి వి. కృష్ణారావు - ఆంధ్రజ్యోతి రాళ్ల క్వారీలలో చిన్నపాటి జిలిటిన్ స్టిక్కులు పేలుతూ, పెద్ద పెద్ద కొండలను తుత్తినియులు చేస్తుంటాయి. మీ ఆత్మకథలోని కొన్ని సంఘటనలు చాలామంది కొండల వంటి వ్యక్తిత్వం ఉన్నదనుకునే వారి అసలు రంగులను బయటపెట్టాయి... - యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రపంచ సాహిత్యంలో ఆత్మకథ రాసిన ఒకే ఒక నిర్మాత మీరు. రాయవలసినంత కాన్వాస్, కథ, విషయం ఉంది.. చదివించింది. గొల్లపూడి మారుతీరావు