Navala Naivedyam
Editor · Novels

Price: Rs. 75. రచయితలోని రచనా నైపుణ్యాన్ని, ప్రత్యేకతలను అందిపుచ్చుకున్నప్పుడు మాత్రమే మంచి సమీక్ష వస్తుంది. సరిగ్గా సింహప్రసాద్ గారి తాత్త్వికతను పట్టుకొన్నారు రచన. తాను సాక్షీభూతంగా ఉండి, సంయమనంతో సమీక్ష చేస్తూ ముగింపులో తన తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఒక చదువరిగా, రచయిత్రిగా, సమీక్షకురాలిగా పరిపూర్ణత సాధించారనే చెప్పాలి. “స్త్రీ కేంద్రీత నవలల్లో ఘర్షణ” శీర్షికలో సింహప్రసాద్ గారి స్త్రీ జీవిత చిత్రణ నవలల గురించి చెప్పటం, ఆ పది నవలలకు ప్రథమ తాంబూలం ఇస్తున్నట్లు మొదటి వరుసలో ఉంచటం రచన గారి మనసులో స్త్రీల పట్ల ఉన్న ప్రాధాన్యత తెలుస్తోంది. “మనిషి తను చేసే ప్రతి పనిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా లేమివల్ల కలిమి మనిషికి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్న అంశంగా జీవితంలో కనిపిస్తుంది. ఏదైనా పరిమితి దాటితే ఎలా ప్రమాదకరంగా మారుతుందో మనిషి ఏదో ఒక సందర్భంలో తెలుసుకోక తప్పదు. అప్పుడు ఆ మనిషి ఆ సమర్థన లోని అసత్యం నుండి సత్యం వైపు పయనించే ప్రయత్నం చేస్తాడు" అంటూ ఆశావహ దృక్పథం వెల్లడించారు. చక్కని వాక్య 'రచనా' విన్యాసం గల 'రచన' మరిన్ని 'రచన'లు చేయాలని ఆశిస్తున్నాను.