Narayana Guru

Editor · History

Narayana Guru book cover

Price: Rs. 90. శ్రీ నారాయణ గురు (1855-1928) దక్షిణ భారత దేశపు గొప్ప సంఘ సంస్కర్తల్లో ఒకరు. కేరళ సమాజంలో విప్లవాత్మక మార్పులకు మూలపురుషుడైన ఆ మహనీయుడినీ, ఆనాటి కేరళ సమాజ స్థితిగతులనీ మా పాఠకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నాం. కేరళలో అత్యధిక సంఖ్యాకులైన వెనుకబడిన తరగతులకు, షెడ్యూల్డ్ తరగతులకు చెందిన (ఈళవ, పులయ తదితర కులాల) వారి పరిస్థితి ఆనాడు ఎంతో దయనీయంగా వుండేది. వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసేవారు. చదువుకునే అవకాశాలు గానీ, దేవాలయాల్లో అడుగుపెట్టే అర్హత గానీ, వాళ్ళకి వుండేవి కాదు. అలాంటి వాతావరణంలో సంప్రదాయ సంకెళ్ళను ఛేదించే లక్ష్యంతో ఆర్య దేవాలయాలకు పోటీగా సొంత దేవాలయాను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీ నారాయణ గురు. అట్టడుగు కులాల వాళ్ళనే పూజారులుగా, పురోహితులుగా నియమించారు. ఈ విప్లవాత్మక చర్య కేరళ అంతటా సంచలనం సృష్టించింది. నిమ్నకులాల వారిలో గొప్ప ఆత్మ విశ్వాసాన్ని, స్వాభిమానాన్ని పెంపొందించింది. అయితే కేవలం దైవారాధన వల్ల వెనుకబాటుతనం తొలగిపోదన్న విషయం శ్రీ నారాయణ గురుకు తెలుసు. అందుకే ఆయన తన దేవాలయాలను విద్యాలయాలుగా కూడా తీర్చిదిద్దారు. విద్యావ్యాప్తికి నిర్విరామంగా కృషి చేశారు. ఈనాడు అక్షరాస్యత, ప్రజారోగ్యం, భూసంస్కరణలు, స్త్రీ విద్య తదితర రంగాలలో కేరళ దేశంలోనే అగ్రగామిగా వుంది. ఆధునికమైన, శక్తి సంపన్నమైన స్ఫూర్తిదాయకమైన పౌర సమాజం ఆ రాష్ట్రంలో నెలకొని వుంది. అందుకు పునాదిరాయి వేసినవాడు శ్రీ నారాయణ గురు.

Browse more Telugu books