Naramedhaalu Niyogaalu
Dr. B. Vijayabharathi / డా. బి. విజయభారతి · Literature

Price: Rs. 225. మహాభారతంలోని సర్పయాగము, రాక్షసమేధమూ, ఖాండవ దహనమూ, శత్రువులను మూక ఉమ్మడిగా హతమార్చిన సంఘటనలుగా గుర్తించవచ్చునని ఈ పరిశీలన చెబుతున్నది. పురోహిత వ్యవస్థ, పురుషస్వామ్యమూ రాజకీయ హత్యలూ, నియోగ పద్ధతులూ కింది వర్గాలనూ స్త్రీలనూ అణచిపెట్టి ఉంటే ధర్మసూక్ష్మాలుగా రూపొందటాన్ని ఇక్కడ గమనించవచ్చు. పురాణాలలోని కథలను పరమ సత్యాలుగా పవిత్ర విషయాలుగా నమ్మేవారు. వాటిలోని అంతరార్థాలను గ్రహించవలసిన అవసరం ఈనాడు ఎక్కువగా కనిపిస్తున్నది. అరుంధతినీ వసిష్ఠుడినీ ఆదర్శదంపతులుగా చూసే సమాజం ఈనాడు వర్ణాంతర వివాహాలను ఎందుకు అంగీకరించలేకపోతున్నది? గుణకర్మల వల్లనే వర్ణం నిర్ణయమవుతుందన్న గీతా బోధనను ఎందుకు మన్నించలేకపోతున్నది? జ్ఞాన సమాజం కులాల సమాజంగా ఎందుకు మారింది? అని ప్రశ్నించుకుని పురోగమించవలసిన తరుణంలో ఈ గ్రంథంలోని పరిశీలన కొంతైనా పాఠకులను అలోచింపజేస్తుంది. పూర్వ సంస్కృతిని అర్థం చేసుకోవటంలో ఇదొక కోణం. తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేసిన డా|| బి. విజయభారతి లోతైన పాండిత్యంతో రామాయణం వంటి పురాణాలను నిశితంగా విశ్లేషిస్తూ, పునఃపరిశీలిస్తూ వాటిలోని మాయామర్మాలను ఎత్తిచూపుతూ సత్యహరిశ్చంద్రుడు, దశావతారాలు, షట్చక్రవర్తులు, వ్యవస్థను కాపాడిన రాముడు, రామాయణ మునుల వంటి పలు పుస్తకాలు రచించారు. వీరు రాసిన అంబేడ్కర్, పూలే జీవిత చరిత్రలు బహుళ ప్రాచుర్యం పొందాయి.