NARAHANTAKUNI SWAGATAM

Editor · History

NARAHANTAKUNI SWAGATAM book cover

Price: Rs. 25. బెల్జియన్ రాజు కాంగో పాలన గురించిన ఈ అభిశంసన తన మరణానంతరమే అచ్చు కావాలనే నియమమే విధించలేదు మార్క్ ట్వేన్, 1905లో ఈ పుస్తకం King Leopold's Soliloquy-A defence of his Congo Rule వెలుగుచూసింది. 1885లో జరిగిన బెర్లిన్ కాన్ఫరెన్స్ కాంగో మీద లియోపాల్డ్ అధికారాన్ని అంగీకరించి, అతడు అక్కడ స్వేచ్ఛా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ, బానిస విధానాన్ని రద్దు చేసి, ఆటవికులైన ఆదివాసుల్లో 'నాగరికత' పెంచటానికి కృషి చెయ్యాలని నిర్దేశించింది. అలా ఏర్పడిన కాంగో ఫ్రీస్టేటికి లియోపాల్డ్ తిరుగులేని అధినేత. లియోపాల్డ్ వ్యక్తిగత ఆస్తిగా మారిన కాంగో విస్తీర్ణం పదిలక్షల చదరపు మైళ్ళు, జనాభా రెండు కోట్లు. అధికారాన్ని చేపట్టిన వెంటనే లియోపాల్డ్ రాజ్యంలోని ఖాళీ స్థలాలన్నీ తనవేననీ, అక్కడి సహజ సంపద అంతా తనదేననీ ప్రకటించాడు. ఆస్తుల్ని పోగొట్టుకున్న లక్షలాది మంది బానిసలుగా మారారు. 1904 నాటికి లియోపాల్డ్ పాలనలో యాభై నుండి ఎనభై లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. బతికిన వాళ్ళు కాళ్లూ, చేతులూ (నరికెయ్యగా) పోగొట్టుకొని మృతజీవులుగా మిగిలారు.

Browse more Telugu books