Nannu Nadipinchina Charitra
Vakulabharanam Ramakrishna / వకుళాభరణం రామకృష్ణ · Biographies & Auto Biographies

Price: Rs. 140. వకుళాభరణం రామకృష్ణ (1938-) జవహర్ భారతి కళాశాల, కావలి: ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరులలో కళాశాల విద్యనభ్యసించారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీలో పరిశోధన చేసి పిహెచ్.డి. పట్టా పొందారు. జవహర్ భారతి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, హైదరాబాదులలో చరిత్ర బోధించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ (వ్యవస్థాపక సభ్యులు), అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి; అఖిల భారత చరిత్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి క్రీ.పూ. నుండి క్రీ.శ. 2012 వరకు, చారిత్రక ఆధారాలు (ప్రత్యేక సంపుటంతో సహా), తొమ్మిది సంపుటాలకు ప్రధాన సంపాదకుడు. ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక, చారిత్రకాంశాలపై గ్రంథాలు, పలు వ్యాసాలు రచించారు.