Nannaku Neeraajanam / నాన్నకు నీరాజనం
Thatavarthi Nageswari / తటవర్తి నాగేశ్వరి · Stories & Poetry

Price: Rs. 180. తటవర్తి నాగేశ్వరి గారి కథల్లో సానుకూలదృష్టి. మానవ సంబంధాలు మరింత బలం సంతరించుకోవాలన్న తపన చిత్రితమయ్యాయి. ఘర్షణ అనివార్యమైన పరిస్థితుల్లోనూ మనుషులు నేర్పుగా, ఓర్పుగా వ్యవహరించి పనులు చక్కదిద్దుకో వాలన్న సూచన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో వచ్చే పొరపొచ్చాలకు, మనస్పర్థలకు సహనంతో కూడిన వ్యవహారశైలి పరిష్కారాలు చూపుతుంది. పెద్దవాళ్ళను ఎదిరించి కూడా తమ దారిన తాము ప్రయాణించవచ్చు. కానీ వారి పట్ల గౌరవాభిమానాలు చూపుతూ, వారిని ఒప్పించి మెప్పించుకోవడం బంధాల్ని పటిష్టం చేస్తుందన్న భావన నాగేశ్వరి గారి కథల్లో నిబిడీకృతమై వుంది. ఈ దృష్టికోణం పాఠకుల్లో హృదయ సంస్కారానికి తోడ్పడుతుంది. పరిస్థితుల ప్రాబల్యం కారణంగా పక్కదారులు పట్టే మనుషుల్ని అర్థం చేసుకునే దయాగుణాన్ని చూపుతుంది. స్త్రీ పురుష సంబంధాల్లోనూ సమానత్వాన్ని సాధించుకోడం ఎలానో చెబుతుంది. అందుకే నాగేశ్వరి గారి కథలు చదవడం పాఠకులకు ఒక మేల్కొల్పు.