"Nallamala Parirakshana Bahujana Bathukamma
మిత్ర / Mithra · Literature

Price: Rs. 135. విధ్వంసకరమైన యురేనియం తవ్వకాల బారినుండి నల్లమలను కాపాడుకుందాం అంటూ విస్తృత ప్రజాభిప్రాయం ఇప్పటికే వచ్చింది. ఈ దిశగా అనేక పుస్తకాలు పరిశోధనలు ప్రజా సాహిత్యం కూడా దండిగానే వెలువడింది. ప్రజల నాడిని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యురేనియం పరిశోధనకు అనుమతులు ఇచ్చినా తవ్వకాలకు అనుమతులు ఇచ్చేది లేదంటూ ప్రకటించాల్సి వచ్చింది. అయినా ఈ ప్రకటనతో ఆగిపోవాల్సింది ఏమీ లేదంటూ ఐక్య ఉద్యమమే అంతిమంగా నల్లమలను కాపాడగలదంటూ బహుజన బతుకమ్మ బయలుదేరింది. నల్లమలను రక్షించుకునే ఆచరణే గీటురాయి అంటూ ప్రకటించింది. ఈ దిశగా భావ ప్రచార ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ 1, 2019 న రాష్ట్ర సదస్సు నిర్వహించి యురేనియం తవ్వకాల ప్రమాదాన్ని బతుకమ్మకు నల్లమలకు గల అనుబంధాన్ని, ప్రమాదకరంగానీ పోడు వ్యవసాయాన్ని, నవధాన్యాల సంస్కృతిని విస్తృతంగా చర్చించడం జరిగింది. "యురేనియం- ఉరెయ్యనియ్యం" అంటూ ఒక నృత్య నాటికను సైతం రూపొందించి అరుణోదయ వారిచే ప్రదర్శించింది. ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చి దానికనుగుణంగా ప్రజల్ని సమాయత్తం చేసే కృషిలో పడ్డది. దీనిలో భాగంగానే పలు వ్యాసాలు - పాటలు - కవితలతో కూడిన "బహుజన బతుకమ్మ - నల్లమల పరిరక్షణ” అంటూ వెలువరిస్తున్న ఈ పుస్తకాన్ని పదరలో ఆవిష్కరిస్తుంది.