Nagabharatham, Madhiga Thathvam, Buddhudu-Karlmarx
Editor · Politics

Price: Rs. 120. చారిత్రక పూర్వదశలో బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని దిక్కరించిన నాగజాతి ప్రగతిశీల సాంస్కృతిక వారసత్వాన్ని అంబేడ్కరీయ హేతువాద దృక్పధంతో రాసిన గ్రంథమే వజ్రపు సాంబమూర్తి, బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్టమొదటి మహామేధావి డా॥ బి.ఆర్. అంబేడ్కర్. కార్ల్ మార్క్ ను బుద్ధుని పోల్చి చూడడం జోక్ గా అనిపించవచ్చు. ఇందులో ఆశ్చర్యపడవలసింది లేదు. మార్క్ ్సకీ బుద్ధునికి 2381 ఏళ్ళ కాల వ్యవధి ఉంది. బుద్ధుడు క్రీ.పూ. 563లో జన్మిస్తే మార్క్స్ క్రీ.శ.1818లో జన్మించాడు. కార్ల్ మార్క్స్ ఒక కొత్త భావజాలానికి రాజనీతికి కొత్త ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన చేసినవాడు. ఇందుకు భిన్నంగా బుద్ధుడు కేవలం ఒక మత స్థాపకుడుగా - అది ఆర్థిక రాజకీయ విషయాలకు ఏ మాత్రం సంబంధం లేని మత స్థాపకుడుగా విశ్వసింపబడ్డాడు. ఈ వ్యాస శీర్షిక "బుద్ధుడు - కార్ల్ మార్ప్స్” మధ్య విభిన్నమైన ఆలోచనలకు చెందినవాళ్ళను, సుదీర్ఘకాల దూరం గల వ్యక్తులను పోల్చి చూడడం లేక వాళ్ళ మధ్యగల భేదాలను చెప్పడం ఈ శీర్షిక ద్వారా అర్థం చేసుకోవచ్చు.