Naa Toli Jeevitam Fidel Castro
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 175. అమెరికాకు అతి దగ్గరగా వుండే అతి చిన్న దేశమైన క్యూబాను సోషలిస్టు పథంలో ఆచంచలంగా నడిపిస్తున్న ఫైడెల్ కాస్ట్రో మన కాలపు అత్యున్నత నాయకులలో ఒకరు. ఆయన పేరే సామ్రాజ్యవాద వ్యతిరేక స్పూర్తికి, సాహసానికి సంకేతం. జీవిత సంధ్యాసమయంలో కాస్ట్రో తన అనుభవాలు నెమరేసుకుని అందించిన స్మృతుల సంకలనమిది. బాల్యం, విద్యార్థి దశలో యూనివర్సిటీలో నడిపిన ఉద్యమాలు, యువకుడుగా తన ఆలోచనలు అనుభవాలు నిర్మొహ మాటంగా వివరిస్తారు. కొలంబియాలో అంతర్జాతీయ విద్యార్థి మహాసభ కోసం వెళ్లిన కాస్ట్రో అనుకోకుండా అక్కడ పెల్లుబికిన ప్రజా వెల్లువలో భాగస్వామి కావడం, వారితోపాటు వీరోచితంగా నిలబడి " నేర్చుకున్న పాఠాలు, తర్వాత క్యూబాలో విప్లవ విజయానికి వాటిని వినియోగించు కోవడం నవివరంగా తెలియ జేస్తారు. అనుభవాలతో పాటు ఆలోచనల పరిణామాన్ని కూడా పంచుకుంటారు.