Naa sonthagadda paine Nenuoka paraivanni
Editor · Politics

Price: Rs. 159. రైల్లో మొబైల్ ఫోన్ మోగితే ఎత్తుకొన్న వ్యక్తి ఎప్పుడూ 'సలాం’ అని అనడు. అది నా అనుభవం. అవతలి వ్యక్తి ఆ పదం ఉపయోగించినా సరే సలాం అని ప్రతిస్పందించడు. రైలు బోగీలో ఎప్పుడూ అలాంటి స్పందన విన్పించదు. దాని బదులు హలో అని సంభాషణ మెదలెట్టాడు. ముక్తసరిగా ఊ, ఆ, హా, హు అంటూ శబ్దాలు చేస్తాడు. ఇప్పుడే స్టేషన్ నుండి బండి కదిలింది వంటి సంపూర్ణ వాక్యాలు మాత్రమే అతని నుండి వినబడతాయి. మిగతా సంభాషణ అంతా సగం వాక్యాలతో నడుస్తుంది. అదెలా అన్పిస్తుందంటే ఇద్దరు వ్యక్తులు పురాతన ఖజానా గురించి పేపర్ మీద మార్క్ చేసిన ఎక్స్ అక్షరంపై గుసగుసలాడుతున్నట్లు ఉంటుంది. ఈ పుస్తకం పొడి పొడి మాటలతో మౌనంగా చేసే సంభాషణల గురించి రాసింది. వాస్తవంగా అనుభవిస్తున్న దానిని కూడా అలాంటిది ఏదీ లేదని గట్టిగా నిరాకరించే ధోరణి ముస్లిములలో ఏర్పడటం గురించి ఈ పుస్తకం వివరిస్తుంది.