Naa smruthilo cheguvera
Editor · Best Selling

Price: Rs. 120. చేగువేరా ఒక్కసారిగా అదృశ్యమైనప్పుడు దానిపై రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. తొలి దశలో అతని క్షేమం దృష్ట్యా క్యూబా మౌనం పాటించింది. చివరకు 1967లో అతను హత్య గావించబడ్డాడని నిర్ధారించుకున్న తరువాతనే కాస్ట్రో అందుకు సంబంధించిన పూర్తి వాస్తవాలు బయటపెట్టాడు. వాటిలోనే ఆయన చే వ్యక్తిత్వ విశిష్టతకు నివాళులర్పించారు. అదే సమయంలో గెరిల్లా యుద్ధంలో చే అనుసరించిన పద్ధతుల్లో కొన్ని లోపాలను చూపడానికి కూడా కాస్ట్రో సంకోచించలేదు. వాటిని, తరువాత వివిధ దశల్లో చే గురించి చేసిన ప్రసంగాలను కలిపి ఈ పుస్తకం రూపొందింది.