Musunuri Prolaiah

Yadlapalli Amarnadh / యడ్లపల్లి అమర్ నాథ్ · History

Musunuri Prolaiah book cover

Price: Rs. 225. ముసునూరి ప్రోలయ్య మహారాజు రేకపల్లి కాళీ దేవతను -పూజించిన స్థలం వద్ద తన పరిశోధనల్లో భాగంగా ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో 2015 సం॥లో రేకపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించిన ఈ పుస్తక రచయిత అమర్నాథ్ ముసునూరి వంశీకుల గురించి 10 సం॥ నుండి పరిశోధనలు చేస్తూ, పాతికసార్లకు పైగా రేకపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించి ఎలుగుబంటి దాడిని ఒక సందర్భంలో ఎదుర్కొని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముసునూరి ప్రోలయ్య ఆనవాళ్ళను ప్రపంచానికి పరిచయం చేశాడు... యువ చరిత్రకారుడు యడ్లపల్లి అమర్నాథ్. కాలగర్భంలో కలిసిపోతున్న ముసునూరి ప్రోలయ్య చరిత్రను అనేక శాసన, సాహిత్య ఆధారాలతో వెలుగులోకి తీసుకువచ్చాడు. ఈమని శివనాగిరెడ్డి గారు మరియు కోగంటి గాంధీబాబు గారు వంటి గొప్ప చరిత్రకారులు ఈ పుస్తకానికి ముందుమాటలు వ్రాయటం ఈ పుస్తకానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. ముసునూరి రాజ్యాన్ని రేకపల్లి రాజధానిగా అనేక సం॥లు పరిపాలించిన ముసునూరి ప్రోలయ్య చరిత్ర మీద మంచి చరిత్రకారునిగా అతి చిన్నవయస్సులోనే గుర్తింపు పొందిన యడ్లపల్లి అమర్నాథ్ రచించిన ప్రామాణిక పుస్తకం ఇది.

Browse more Telugu books