Munneeti Geetalu

Chintakindi Srinivasa Rao / చింతకింది శ్రీనివాసరావు · Novels

Munneeti Geetalu book cover

Price: Rs. 180. 2021లో జరగవలసిన 23వ తానా మహాసభలు కోవిడ్ కారణంగా జరగక పోయినప్పటికీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించినట్లుగానే రెండు లక్షల రూపాయల బహుమతితో తానా 2021లోనూ నవలల పోటీ నిర్వహించింది. ఈ పోటీకి వచ్చిన 107 నవలలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం బహుమతి మొత్తాన్ని రెండు నవలలకు సమానంగా అందించాలని నిర్ణయించారు. వాటిలో చింతకింది శ్రీనివాసరావు రచించిన ఈ మున్నీటి గీతలు ఒకటి. కళింగాంధ్ర ఎక్కడ... కరాచీ మరెక్కడ, నాగావళి ఏ మూల... సింధునది ఇంకేమూల. తూర్పుతీరం ఇటుపక్క.. అరబిక్ కడలి అటువైపు. ఇంత దూరాన్నీ చెరిపి పారేస్తోంది ఆకలి. ఇంత దూరాన్నీ చెరిగి పోసేస్తోంది ఆకలి. ఉత్తరాంధ్ర జాలర్ల నేత్రాల్లోంచి ఉప్పుసముద్రాలు ఊరేలా చేస్తోంది ఆకలి. వలస బెస్తల బతుకుల్ని బుగ్గి చేస్తోంది ఆకలి. చేపలు పట్టడానికి సిక్కోలు మత్స్యకారులు గుజరాత్ దాకా పోవడం ఏంటి? వడమర కడలిలో నిండు జీవితాలను అస్తమయం చేసుకోవడం ఏంటి? ఇదంతా పిడికెడు గింజల పొట్టకోసమేనా?...

Browse more Telugu books