Mudu Dhashabdala Naya-udharavadha Vidhanalu, Angles, Em cheyali

Editor · History

Mudu Dhashabdala Naya-udharavadha Vidhanalu, Angles, Em cheyali book cover

Price: Rs. 126. భారత దేశంలో ప్రత్యేకించి 2014 నుండీ కార్పొరేట్ శక్తుల, మతతత్వ శక్తుల కూటమి రూపొందింది. వారి నడుమ బంధం నిరంతరం బలపడుతోంది. అతి హీనమైన ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి ఇది దారి తీస్తోంది. కార్పొరేట్ క్రోనీలు పెద్దఎత్తున సంపద కొల్లగొడుతున్నారు. తాజాగా ప్రకటించిన జాతీయ నగదీకరణ పైడ్లైన్తో మన దేశపు జాతీయ సంపదనంతటినీ భారీగా కొల్లగొట్టేందుకు మార్గం చేస్తున్నారు. ఇది అడ్డూ, ఆపూ లేని నయా-ఉదారవాద ఆర్థిక సంస్కరణలలో భాగమే. ఆర్ఎస్ఎస్ ప్రాజెక్టు ముందుకు పోడానికి ఇది తోడ్పడుతుంది. సోషలిజం కోసం కృషి చేస్తున్న నాయకులకు ఈ పుస్తకం ఒక దిక్సూచి. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో చేయాల్సిన పనిపట్ల అవగాహన కల్పించేందుకు. ప్రతి ఒక్కరూ తమ పనిని మెరుగుపర్చుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్యమ సహచరుల నుంచి, ఇతరుల నుంచి ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు మొదలుకొని సోషలిస్టు సామాజం సాధించుకునే వరకూ కార్యకర్తలు అనుసరించాల్సిన పద్ధతులను తెలియజేసే పుస్తకమే 'ఏం చేయాలి'. ఐవి లెనిన్ రాసిన ఈ పుస్తకాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా అతి సాధారణమైన భాషలో సంక్షిప్తీకరిచాం. పెట్టుబడిదారీ సమాజంలో నిత్యం ప్రజలు పోరాటాలు చేస్తుంటారు. వారిలో వర్గచైతన్యం. రాజకీయచైతన్యం నింపాల్సిన బాధ్యత సోషలిస్టులపై ఉందని చెప్తూనే 1860ల నాటి నుంచి బ్రిటీష్, బెల్జియం, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, జర్మనీ, రష్యా తదితర కార్మిక ఉద్యమాల అనుభవాలనుంచి నేర్చుకోవాల్సిన విషయాలను తెలియజేశారు. మారుతున్న కాలానికనుగుణంగా ఉద్యమాలను అంచనా వేయడంతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలను, నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఇందులో ఉన్నాయి.

Browse more Telugu books