Movie Masters
Editor · Best Selling

Price: Rs. 180. * సబ్ రిజిస్ట్రార్ గా పదవీ నిర్వహణ నటుడు, నాటక రచయిత, దర్శకుడు సినీ రచయిత, వ్యాసకర్త, చరిత్రకారుడు వక్త, ప్రయోక్త, వ్యాఖ్యాత, సినీ విజ్ఞాన విశారద' టివి ఛానళ్ళకు వెయ్యి కార్యక్రమాలకు రచన వ్యాఖ్యానం 'హాసం క్లబ్స్' స్టేట్ కన్వీనర్ వెయ్యి సినీ సంగీత కార్యక్రమాలకు వ్యాఖ్యానం ఎస్.వి.రామారావు రచయిత * 6 నంది అవార్డులు, ఫిలిం జర్నలిస్ట్ గా 'రామినేని ఫౌండేషన్' పురస్కారం * తెలుగు యూనివర్సిటీ 'కీర్తి' పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వ 'కళారత్న(హంస)' పురస్కారం సినీ రంగంలో వున్న కళాకారులకి వున్న విశేష ప్రజ్ఞ ఏమిటి, యితరుల కంటె ఏ ప్రత్యేకతను చాటుకుని పలు దశాబ్దాల పాటు వృత్తిలో రాణించగలిగారు అని ఎత్తి చూపడం, వివరించి, విశ్లేషించడం 'సినీవిజ్ఞాన విశారదులకే తగును. శ్రీ ఎన్.వి.రామారావు గారు ప్రభుత్వోద్యోగం చేసుకుంటూనే సినీప్రపంచంలో ప్రముఖులందరితో పరిచయాలు పెంచుకుని, వారితో కలిసి పని చేసి, ఎవరు ఏ విద్యలో నిష్ణాతులో క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవారు. సినిమాను ఎలా ఆస్వాదించాలో పత్రికల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, వ్యాఖ్యానాల ద్వారా సినీ ప్రేక్షకుల అవగాహనను, అభిరుచిని పెంచడమనేది ఒక ఉద్యమంలా చేపట్టిన వ్యక్తి. దైవదత్తమైన ధారణశక్తి, వాగ్దాటి ఉపయోగించి సినిమా పాటల సంగీతసాహిత్యాల గురించి, సంభాషణల గురించి, సీన్ల చిత్రీకరణ గురించి, వివిధ సాంకేతిక నిపుణులు కనబరచిన నైపుణ్యం గురించి వందలాది వ్యాసాలు, టీవీ కార్యక్రమాల ద్వారా, వేలాది సభాకార్యక్రమాల ద్వారా ఆయన యిచ్చిన వివరణ రసజ్ఞుల మనస్సుల్లో నాటుకుపోయి, ఆయా కళాకారుల పట్ల వారికి ఆరాధనా భావాన్ని పెంచింది. ఈ పుస్తకం ద్వారా ఆయన దివంగతులైన తెలుగు సినిమాకు సంబంధించిన కథానాయికా నాయకుల, కారెక్టరు నటుల, దర్శకుల, నిర్మాతల, సాంకేతిక నిపుణుల ప్రతిభావిశేషాలను గ్రంథస్తం చేశారు. నిజానికి ఒక్కొక్కరి గురించి ఒక్కో పుస్తకం రాయగల మేటరు వుందాయన దగ్గర. కానీ వారి జీవితాన్ని చిలికి, నవనీతాన్ని మాత్రమే మనకు అందించారు. యావత్ ప్రపంచం ప్రశంసించే స్థాయికి తెలుగు సినిమా యీ రోజు చేరిందంటే దానికి కా