Moodu Beerla Tarvata

Editor · Stories & Poetry

Moodu Beerla Tarvata book cover

Price: Rs. 160. ఆధునిక స్త్రీ అంతరాత్మని పట్టుకొన్న కొత్తతరం రచయితల్లో ముఖ్యమైన రచయిత యీ రచయిత, తను మాత్రమే రాయగలిగిన, రాయాల్సిన యెన్నో కథలు యితని కోసం యెదురు చూస్తూ వుండటమే. యీ రచయిత మీద తెలుగు కథ పెట్టిన బాధ్యత, అదీ అక్కిరాజు ప్రత్యేకత. - కుప్పిలి పద్మ కథ అంటే వాస్తవికతకి ఎదురీదే వూహ. ఊహకి ఎదురీదే వాస్తవికత. ఆ రెండిటి మధ్య కచ్చితంగా గురి చూస్తాడు అక్కిరాజు. అతని ప్రతి కథా లెక్క తప్పని equation. ప్రతి కథనం mathematical precisionతో మెరుస్తుంది! అనుభూతి ప్రకంపనలు కూడా తగినంత richter scale మీద వుంటేనే అది అక్కిరాజు మార్క్! - అప్సర్ అనేక జీవన వైరుధ్యాల మధ్య, వైపరీత్యాల మధ్యా ఇంకా గుండెలో తడిని నిలుపుకుని రాసిన కథలివి. వివక్ష ఏ రూపంలో ఉన్నా.. పసిగట్టినవి కొన్ని, వ్యంగ్యాన్ని సమర్ధవంతంగా వాడుకున్నవి కొన్ని, అక్కిరాజు మాత్రమే రాయగలిగినవి కొన్ని, భిన్నకోణాల్లోంచి దర్శించిన జీవితాన్నీ, ఒక చింతకుడి నిశితమైన యోచనలనూ నిజాయితీగా కొత్త ఆలోచనలు రేకెత్తేలా పాఠకుల ముందుంచినవే అన్నీ - చంద్ర కన్నెగంటి

Browse more Telugu books