Mohitha
Editor · Novels

Price: Rs. 70. తెలుగులో నవలా సాహిత్యంలో పాపులర్ రీడింగ్కు నాంది పలికిన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి. ఆమె తీర్చిదిద్దిన ప్రతిపాత్రలోనూ తన ఐడెంటిటిని చూసుకోవాలని ప్రతి చదువరీ చేసే ప్రయత్నమే ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనము. పాఠకుల గుండెల్లో, గుండెలోతుల్లో మధురమైన భావాలను కలిగిస్తూ, మధురానుభూతుల్ని మిగులుస్తూ ఆమె చేసిన రచనలు ఎన్నో.. సెక్రటరీ, అభిశాపం, గిరిజాకళ్యాణం ఇలా ఎన్నెన్నో నవలలు ఆ మహా రచయిత్రి కీర్తికిరీటంలో పొదిగిన వజ్రాలు. అందుకే ఆమెను 'నవలాదేశపురాణి'గా అభివర్ణించారు స్వాతి వారు. 'నవలాదేశపురాణి' యద్దనపూడి సులోచనారాణి కీర్తి కిరీటంలో చేర్చుకోదగ్గ కోహినూరు వజ్రపుస్థాయి నవల "మోహిత”.