Mohana! O Mohana!

Editor · New Arrivals

Mohana! O Mohana! book cover

Price: Rs. 100. కష్టాల్లో ఆవిర్భవించిన కవి. ఉద్యమాలతో వికసించిన కవి. కవిత్వ నేపథ్యమంతా పల్లెటూళ్ళతో, మనుషులతో, విద్యార్థులతో, యోధులతో, స్త్రీలతో, అనాథలతో, జానపద గాయకులతో కళకళ లాడుతుంది. చాలామంది తెలంగాణ కవుల కంటే ఎక్కువగా శివారెడ్డి కవిత్వంలో తెలంగాణ పల్లెలు పలకరిస్తాయి. తెలంగాణ లోనే ఎక్కువ సంచరించాడు కనుక తెలంగాణలోనే ఆయన కవిత్వ ప్రియులు ఎక్కువ. తెనాలిని మించి తెలంగాణలోనే ఆయన ఎక్కువ పాపులర్. తెలంగాణ బాధల్ని బరువుల్ని పోరాటాల్ని ఆయన రాత చేసుకున్నాడు. ఆయనను తెలంగాణ సొంతం చేసుకున్నది. శివారెడ్డి తెలంగాణకు దత్తకవి. గాయాల, బాధల, ఉద్యమాల, అమరుల పాటలు కట్టేకవి. -డా|| నందిని సిధారెడ్డి నేనెప్పుడూ ఇతరుల్ని సంతోషపెట్టటానికో, సంతృప్తిపరచటానికో, లేదూ వాళ్ళచేత మెప్పు పొందటానికో రాయలేదు. నన్ను నేను చీల్చుకుని, దహించుకుని, పుటం పెట్టి పరీక్షించుకొని, అదొక పవిత్ర ధర్మంలానే రాశాను. నిజాయితీ లేకుండా గాఢంగా నమ్మకుండా ఒక అక్షరం కూడా రాయలేదు. తరచి తరచి, శోధించి ఆచరణలో పరీక్షించుకుని అడుగు ముందుకేశాను. కవిత్వం నాకు సర్వస్వమయింది. నన్ను నడిపించే శక్తి అయింది. నాకు ప్రాణమయింది. నన్ను మనిషిని చేసిందీ అదే! -కె. శివారెడ్డి

Browse more Telugu books