Modugupoolu
దాశరధి రంగాచార్య / DASARATHI RANGACHARYA · Novels

Price: Rs. 180. తెలంగాణా జనజీవనం నిజాంపాలన నాటి తదనంతర రైతాంగ పోరాటం, నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాల నేపథ్యంలో దాశరథి రంగాచార్య రూపు కట్టించినట్టు మరే రచయితా చిత్రించలేదన్నది సత్యం. చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామ దశల్లో జనశ్రేణులు ఎలా స్పందించిందీ, తమ సాంస్కృతిక స్వేచ్ఛ కోసం ఎలా నిరసన తెల్పిందీ, రాజకీయ అస్తిత్వం కోసం ఎలా ఆందోళన, తిరుగుబాటు, ప్రతిఘటనలు చేసిందీ - చివరకు భూమికోసం, భుక్తికోసం, భాషకోసం, వెట్టిచాకిరి అంతం కోసం, నిజాం పాలనను తుదముట్టించటం కోసం ఎలా సంఘటించి పోరాడిందీ 'దాశరథి రంగాచార్య రచనలు' నేటితరానికి కళ్ళ ముందు కదలాడేలా చేస్తాయి. చిల్లరదేవుళ్ళు, మాయజలతారు, మోదుగుపూలు, జనపథం వంటి నవలలు 'చరిత్ర నిర్మాతలు జనం' అన్న సత్యాన్ని వెల్లడిస్తాయి. వీరి రచనలు జనం భాషలో గుండెలను పలకరిస్తూ, మెదళ్ళకు పదునుబెడ్తాయి. వీరి రచనలు అనేకం ఇతర భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. కొన్ని చలన చిత్రాలుగా కూడా వచ్చాయి. 24-08-1928న ఖమ్మం జిల్లాలోని చినగూడూరులో జన్మించిన దాశరథి రంగాచార్య- సంప్రదాయం పునాదుల మీద ఆకాశమంత ఎత్తుగా ఎదిగి 08 - 06 - 2015న హైద్రాబాద్లో లో తుదిశ్వాస విడిచారు. నైజాం రాజ్యంలో నిరంకుశాధికారాలుగల ఒక జాగీర్దారు, అతని జాగీరులో పన్నులు వసూలు చేయడం నిత్యకృత్యం. 200 రకాల పన్నులుండేవి. చెప్పరాని చిత్రహింసలు, మానభంగాలు, దోపిడీలు అక్కడ సర్వసాధారణ విషయం. పత్రిక చదవడమే మహానేర మైనపుడు అక్కడి పౌరహక్కు లెలాంటివో ఊహించుకోవచ్చు. నిజాం ప్రభువిచ్చే ప్రతి షాంపెన్ పెగ్గుకు లక్ష రూపాయలు చెల్లించుతూ హైదరాబాద్లో జల్సా జీవితం గడపడం తప్ప జాగీర్దారుకు బాధ్యతలు లేవు. అలాంటి జాగీరులో ఎందరో కార్చిన కన్నీళ్ళు, ఓడ్చిన నెత్తురు మోదుగుపూలు నవల ఇతివృత్తానికి ప్రేరణ. సాహిత్య అకాడమీ బహుమతి నండుకొని, నవలా రచనలో అగ్రస్థానాన్ని సంపాదించిన శ్రీ దాశరథి రంగాచార్య స్వాతంత్ర్యానికి పూర్వం తెలంగాణా గురించి రచించిన నవలలో రెండవది మోదుగుపూలు.