MERA MALLESHAM
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 95. మేర మల్లేశం (1924-1997) తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. ఎన్నో పాటలు కట్టిన వాగ్గేయకారుడు. జీవితాంతం కష్టజీవుల పక్షాన నిలబడ్డ కమ్యూనిస్టు. ఆయన నేటి సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని అంతకపేట గ్రామానికి చెందినవారు. తొలుత ఆయన కార్యక్షేత్రం నేటి జనగాం జిల్లాలోని గ్రామాలు, ఆతర్వాత పూర్వ కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ ప్రాంతం. పోరాటంలో భాగంగా జాల్నలో నాలుగు సంవత్సరాల జైలుజీవితం అనుభవించారు. నైజాంపోలీసుల చిత్రహింసలకు గురయ్యారు. హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత విప్లవ కమ్యూనిస్టుగా జీవించారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తూ పాటలు రాసిన అస్తిత్వ చైతన్యం ఆయనది. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఎందరో, ఆ మహత్తర చరిత్రను లిఖించారు. కానీ కామ్రేడ్ మల్లేశం ఒక్కరే స్వీయచరిత్ర రాసుకున్నారు. ఈ చరిత్రతో పాటు రెండవసారి విపుల వ్యాఖ్యానాలతో ఆనాటి పాటలు, రెండు దశాబ్దాల తర్వాత ఆయన జీవిత విశేషాలతో ఈ పుస్తకం వెలువడుతున్నది.