Memu Kuda Charitra Nirmincham
B. Anuradha / బి. అనురాధ · History

Price: Rs. 315. "హిందువులు ప్రవేశించే దేవాలయాల్లోకి మనం ప్రవేశించాలి. వాళ్ళు ఎక్కడ నుండి నీళ్ళు తోడుకుంటారో అక్కడ నుండి నీళ్ళు తోడుకొనే స్వేచ్ఛ ఉండాలి. వీటిని మేము సామాజిక హక్కులు అంటాము. వైస్రాయ్ భుజం భుజం కలిపి నిలబడి రాజకీయ వ్యవహారాల బండిని లాగడం మన రాజకీయ హక్కు" -వారాలే బాయి (పూనా ఒప్పందానికి వ్యతిరేకంగా సత్యాగ్రహంలో పాల్గొని చంటి పాపతో జైలుకి వెళ్ళిన ఒక చదవురాని మహిళా కార్యకర్త, హక్కులుఅంటే ఏమిటని అడిగిన విలేఖరికి ఇచ్చిన జవాబు) "ఆడవాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి మా ఊరి నది దగ్గర కున్బీలకు, మహార్లకు వేరు వేరు బండలు ఉన్నాయి. అయినా నేను కావాలనే కున్టీల బండ దగ్గరకెళ్ళి నా బట్టలు ఉతికాను. మరుక్షణం నలుగురు కున్బీ ఆడవాళ్ళు పరుగెత్తుకుంటూ వచ్చి 'ఏయ్ మహార్నీ నీకు కళ్ళేమైనా దొబ్బాయా? ఇది మా బండ అని తెలియదా నీకు?' అని అరిచారు. 'ఎవర్నే మహార్నీ అంటున్నారు? ఏం...నా బట్టలు ఇక్కడ ఉతికితే ఏమవుతుంది? కావాలంటే మీ బండ మీద నీళ్ళు పోసి శుద్ధి చేసుకోండి' అన్నాను. వాళ్ళు వెంటనే 'ఎంత పనికిమాలిన ఆడదానివి నువ్వు' అనేసరికి నేను కోపం పట్టలేక పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళల్లో ఒకామె జుట్టు పట్టుకున్నాను. నన్ను మహార్నీ అని ఎవరైనా పిలిస్తే నాకు మహా కోపం వస్తుంది. అలా పిలిపించుకోవడం నాకు చెడ్డ అసహ్యం, పెద్ద గొడవయ్యింది. వాళ్ళు నలుగురు ఉన్నారు. నేను ఒక్కతిని. అయితేనేం నేను ఒక్కదాన్ని చాలదా వాళ్ళకు జవాబు చెప్పడానికి. ఇంతలో మా మామగారు జోక్యం చేసుకుని గొడవ ఆపారు." "ఎవరైనా నా అక్కచెల్లెళ్ళను వేధించినా. నా బాబాసాహెబ్ గురించి ఏమైనా అన్నానా రక్తం మరిగిపోయేది.... జైలులో నాపై నిఘా ఉంచే స్త్రీ, "ఏ మహార్నీ, నీళ్ళు ముట్టుకున్నావా?" అంది. అందుకే నేను ఆమె దగ్గరకు పరిగెత్తి పోయి కొట్టాను.. నేను పద్దెనిమిది సార్లు జైలుకు వెళ్లాను...... ఇప్పుడు అన్యాయం జరిగినప్పుడల్లా, స్త్రీ పురుషులం కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. ఆత్మగౌరవంతో పోరాడతాం. వాళ్ళు మాలో పదిమందిని కొడితే తక్కువ కాకుండా తిరిగి ఇచ్చేస్తాం." -శాంతాబాయి సరోదే