MEERU SUCCESS SADHINCHAGALARU
Editor · Education & Science

Price: Rs. 45. డా. దేశినేని వేంకటేశ్వరరావు రచయిత, విద్యావేత్త, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 'సైకాలజీ'లో పిహెచ్.డి. డిగ్రీ పొందారు. విద్యా, మనోవిజ్ఞాన శాస్త్ర సంబంధమైన అనేక అంశాలపై పలు పత్రికల్లో వీరు రచించిన వ్యాసాలు మంచి ప్రజాదరణ పొందాయి. వీరి 'పిల్లల విజయంలో తల్లితండ్రుల భాగస్వామ్యం', 'పిల్లలు చదువుల్లో ఎందుకు వెనకబడతారు?' పుస్తకాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ల నుంచి విశేష ఆదరణ పొందాయి. పిల్లల తెలివితేటల్ని చదువులో సమర్థంగా వినియోగించుకోవడం, ఒత్తిడి లేని అభ్యసనం, సులువుగా లెక్కలు నేర్పడం వంటి అంశాలపై విస్తృత పరిశోధన చేశారు. 'ప్రాజెక్ట్ హ్యాపీ లర్నింగ్', 'మేథ్స్ మేడ్ ఈజీ' అన్న ప్రాజెక్టులు ప్రారంభించి పిల్లల్ని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపట్టారు. సంతోషదాయకమైన జీవితంకోసం... జీవితంలో విజయం సాధించటం కోసం... పాజిటివ్ సైకాలజీ సూత్రాల ఆధారంగా రూపొందిన శక్తిమంతమైన పుస్తకం ఇది. సరైన జీవిత సూత్రాలను పాటిస్తే ఎవరైనా విజయం సాధించగలరని తెలియజేస్తుంది ఈ పుస్తకం.