Meeru "sri" lu
Editor · Personality Development

Price: Rs. 180. నేను గొప్ప వ్యక్తిని ఎందుకు కాకూడదు?" ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలి, మిమ్మల్ని కలవరపెట్టిందా? ఎవరైనా మిమ్మల్ని సంబోధించేటప్పుడు మీ పేరు ముందు 'శ్రీ' పెట్టి పిలిస్తే మీకు ఎంత గౌరవం? మీ పేరు ముందు 'శ్రీ' పెట్టి పిలిపించుకోవాలని ఉందా?... అయితే ఈ పుస్తకం మీ కోసమే. మనలో చాలా మంది తమ శక్తిని గ్రహించకుండా – మేము మట్టిముద్దలం, పప్పుసుద్దలం అనుకుంటూ తమని తాము కించపరచుకుం టుంటారు. ఇలాంటి ఆత్మన్యూనతా భావం తగదు. ఎందుకంటే నిజానికి మనం నివురుగప్పిన నిప్పులం. మనలో 'ఫైర్' ఉంది. కాకపోతే ఆ ఫైర్ ఉందని తెలుసుకోలేకపోతున్నాం. మన మెదడు చాలా శక్తివంతమైనది. అది ఏది తలచుకున్నా, ఆ పనిని నెరవేర్చే సత్తా మనకి ఉంటుంది. కాబట్టి, మన శక్తి మనం తెలుసుకుందాం. మన సత్తా చాటుదాం. మన పేరు ముందు "శ్రీ" పెట్టి పిలిపించుకుందాం. మీరూ -'శ్రీ'లు. - మీరూ - 'శ్రీ' లే