Media Swachhaku Perugutunna Pramadam
Dr. S. Muralidhar / డాక్టర్ ఎస్. మురళీధర్ · Politics

Price: Rs. 38. ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైరయిన జస్టిస్ మురళీధర్ తన పాఠశాల విద్య, కాలేజీ విద్యను చెన్నైలో పూర్తి చేశారు. 1984లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మొదటి ర్యాంకుతో బిఎల్ పట్టా సాధించారు. 1990లో నాగ్పూర్ యూనివర్సిటీ నుండి ఎల్ఎల్ఎం పట్టా కూడా మొదటి ర్యాంకుతో సాధించారు. 2003 ఫిబ్రవరిలో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి పట్టా పొందారు. "భారత దేశంలో న్యాయ సహాయం-క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ" అన్న అంశం పై ఆయన పరిశోధనా పత్రం సమర్పించారు. 1984లో చెన్నైలో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టి. 1987లో ప్రాక్టీసును ఢిల్లీకి మార్చుకున్నారు. సుప్రీంకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో దాదాపు రెండు దశాబ్దాలు ప్రాక్టీసు చేశారు. సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డుగా ఉన్నారు. సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీలో చురుగ్గా పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం కౌన్సిల్గా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గా పని చేశారు. 2002 నుండి 2006 లాకమిషన్ లో పార్ట్ టైమ్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2006లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 జనవరి 4న ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2023 ఆగస్టు 7న రిటైరయ్యారు. ఆయన తీర్పులిచ్చిన కేసుల్లో కమర్షియల్, అర్బిటేషన్లా, పన్నులు, నేర చట్టాలతో పాటు రాజ్యాంగ పరమైన వివాదాలున్నాయి. ఆయన తీర్పులు ఆయా రంగాల్లో చట్టపరమైన అభివృద్ధికి దోహదపడ్డాయి. హైకోర్టు, జిల్లా కోర్టుల్లో పరిపాలన పరమైన, న్యాయపరమైన సంస్కరణలను తెచ్చారు. కటక్లో అత్యాధునిక కోర్టు రికార్డుల డిజిటైజేషన్ కేంద్రాన్ని, జుడిషియల్ ఆర్కీవ్స్, మ్యూజియం స్థాపన లో ఆయన ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. 2023 అక్టోబర్ 17న సుప్రీం కోర్టు ఆయనకు సీనియర్ అడ్వకేట్ హోదాను ఇచ్చింది. ప్రస్తుతం ఆయన సుప్రీం కోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారు.