Media mayajalam

Editor · Cinima

Media mayajalam book cover

Price: Rs. 5. పత్రికలు ఎప్పుడూ సత్యం కోసం పోరాడుతూ, ఎక్కడా రాజీపడకుండా అన్వేషణ చేస్తుంటాయనేది మామూలుగా వుండే అభిప్రాయం. ఇది నిజంకాదని, వార్తలకు సంబంధించిన అన్ని అంశాలను ధనబలం, పాలక వ్యవస్థ చాలా వరకు నియంత్రిస్తాయని ఎడ్వర్డ్ హెర్మన్, నోమ్ చోమ్స్కలు ఈ అధ్యయనంలో నిరూపించారు. మార్కెట్ పోటీ, నిర్వహణా వ్యయం అంతిమంగా వార్తలను ఎలా ప్రభావితం చేస్తాయో విశ్లేషించారు. అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించిన సమాచార వ్యాప్తిలో అనుసరించబడే ద్వంద్వ ప్రమాణాలు బట్టబయలు చేశారు. పత్రికలు ఎంత చక్కగా పాలకవర్గ ప్రచారసేవ నిర్వహించగలవో ఈ చిన్న పుస్తకం తెలియచేస్తుంది. పరిస్థితిని భారతదేశానికి అన్వయించే ఉపోద్ఘాతం జతపరచబడింది. హెర్మన్, చోమ్ స్కీలు ఉభయులూ ప్రొఫెసర్లు మేధావులుగా, రచయితలుగా మీడియా విశ్లేషకులుగా ప్రపంచ ప్రసిద్ధులు.

Browse more Telugu books