MAY DAY GEETHALU
Editor · Best Selling

Price: Rs. 110. సుఖదుఃఖాలు, సంతోష విచారాలు, సంబరాలు సమరాలు ఏవైనా పాటే ప్రతిధ్వనిస్తుంది. ఉన్నఫలాన ఉత్సాహం ఉత్తేజం ఉద్వేగం నింపేది పాట మాత్రమే. ప్రజల జీవితంలో మరీ ముఖ్యంగా ప్రజాఉద్యమాలు పోరాటాలలో పాటలకున్న స్థానం అసమానమైంది. ప్రజాసాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు, కొత్తగొంతులు వినిపించేందుకు ప్రజాశక్తి సాహితీ సంస్థ నిర్వహించిన పోటీలలో ఎంపికైన పాటల సంకలనం ఇది. బహుమతులు పొందినవీ సాధారణ ప్రచురణకు ఎంపికైనవీ కూడా చదవొచ్చు. కవిత్వం కథలతో పోలిస్తే ఇటీవల పాటల రచన తగ్గుముఖం పట్టింది. సినిమాలు మీడియా పోటీలు పాటలను ఆహ్వానిస్తన్నా ఆ తరహా వేరు. ఈ నేపథ్యంలో ప్రజాశక్తి సాహితీ సంస్థ ప్రజా గీతాలకు మనసారా స్వాగతం పలికింది. కొత్త కలాలు ముందుకొచ్చాయి. మేడే ఇందుకు సందర్భమైనా అన్ని సందర్భాలకు అనుగుణమైన పాటలు ఇందులో వున్నాయి. ప్రత్యామ్నాయ ప్రజాసంస్థతి కోసం జరిగే ప్రయత్నంలో పాటకు పెద్ద పీట వేసే ఈ ప్రచురణను ప్రతివారూ ఆహ్వానించాలి.