MAUPASSANT KATHALU
మహీధర జగన్మోహన రావు / Maheedhara Jaganmohana Rao. · Books

Price: Rs. 75. ఆధునిక కథకి ఆద్యులనదగినవారిలో మొపాస ఒకరు. మొపాస పందొమ్మిదవ శతాబ్దపు ఫ్రెంచి రచయిత. రష్యన్ మహా రచయిత తలుస్తోయ్ (టాల్‌స్టాయి) మొపాస శైలి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. జర్మన్ తత్వవేత్త నీషె మొపాసని గొప్ప రచయితగా శ్లాఘించాడు. సోమర్సెట్ మామ్, ఓ హెన్రీ ఇద్దరూ - మొపాసని అనుసరించారు. ఎమిలీ జోలానీ మొపాస ఇష్టపడ్డాడు. బాల్జాక్ని అభిమానించాడు. ఫౌబర్ట్ దీవెనలు అందుకున్నాడు. చిన్నప్పటినుంచీ మొపాసాకి మతమంటే మంట. ఆయన యుద్ధవ్యతిరేకి. ఈ సంపుటోలోని శృంగార కథల్లో శృంగార వర్ణనలేమీ ఉండవుకాని శృంగార నేపథ్యం ఉంటుంది. వ్యర్థ పదాలూ, వ్యర్థ వర్ణనలూ, వ్యర్థ వాక్యాలూ లేకుండా సునాయాసంగా, సాదాగా, సూటిగా ఉంటాయి ఆయన కథలన్నీ.