Mattipula Gali

స్వేచ్ఛ / Swetcha · Stories & Poetry

Mattipula Gali book cover

Price: Rs. 95. కొన్ని జ్ఞాపకాలను వర్తమాన అనుభవ స్థితికి ముడివేసుకుని అన్వేషించడం స్వేచ్ఛ కవితల్లో కనిపించే ఒక లక్షణం. దు ఖపు దుప్పటి, రక్తపు ముసురు, కన్నీటిపూలు, గాలిపూల తోటలు, పసితనపు సంద్రం, గాయపు రంగులు, నల్లటిగాలి జలపాతపు గొంతు, రంగులేని రక్తపు జలపాతాలు, గాలి ఆకుల ఎదురు చూపులు, కుళ్ళిన రెప్పల శవాలు, గాలి గాయాలు, ఉద్వేగపడుతున్న కంటి అల, రాతిముడి, మడతపడిన మబ్బుల ... రంగుల సముద్రం లాంటి అభివ్యక్తితో స్వేచ్ఛ కవిత్వం మనలను ఆకర్షిస్తుంది. నూతన వ్యక్తీకరణ తన సంవేదనల తీవ్రతవల్లనే ఏ కవికైనా సాధ్యమవుతుంది. స్వేచ్ఛ కవిత్వం ఉద్వేగ ప్రధానం. సంవేదనలు ప్రచండం. కాబట్టే చప్పున మనసుకి పడతాయి. ఎక్కువ సందర్భాల్లో స్వేచ్ఛ కవిత్వంలో వ్యక్తంచేసిన అనుభవాలతో 'మనమూ' తాదాత్మ్యం చెందుతాం. ఒక చిత్రమైన సహానుభూతిని పొందుతాం. - సీతారాం

Browse more Telugu books