Matti Vasana

Gannavarapu Narasimha Murthy / గన్నవరపు నరసింహ మూర్తి · Telangana Literature

Matti Vasana book cover

Price: Rs. 135. ఈ కథా సంపుటిలోని విభిన్నమైన 27 కథలు మనుషుల జీవన వేదాన్ని ఆవిష్కరిస్తాయి. శుభాశుభాలు పురోహితులను బట్టి మారిపోవు. మన నుదుటిరాతను బట్టి మారతాయి. చుట్టుపక్కల అందరి మరణాలను చూస్తున్నా తను మాత్రం చావను అని ప్రతిమనిషి అనుకుంటాడన్న చేదు నిజాలను చక్రభ్రమణం కథ చెబుతుంది. "గుడ్డుని బయటనుంచి పగలగొడితే బతుకు అంతం. లోపలి శక్తికి పగిలితే పుట్టుక ఆరంభం గొప్ప పనులెప్పుడూ లోపలినుంచే మొదలవుతాయి" అని ఇందులో ఇంకొక కథ ఆవిష్కరిస్తుంది. “తప్పు చెయ్యకపోయినా అహల్యనూ, సీతనూ శిక్షించే సమాజం మనది" అన్న గొప్ప నీతిని 'నాటకం' కథ ప్రబోధిస్తుంది. పరిస్థితులు, సమాజం మనిషిని చెడ్డవాడిగా మారుస్తాయి అని 'ప్రాయశ్చిత్తం' కథ బోధిస్తుంది. 'అనాయాస మరణం వినా దైన్యేన జీవనం' అన్న జీవన వేదాన్ని "పొద్దువాలి పోయింది" కథ ఘోషిస్తుంది. ఇలా ఇందులో ఎన్నో చేదు నిజాలు మనకు గోచరిస్తాయి. సమస్యల్ని ఆవిష్కరిస్తాయి. ఎలా ముందుకు వెళ్ళాలో నిర్దేశిస్తాయి. అందుకే ఈ కథలన్నిటినీ చదవాలి... వాటి పరిమళాలను, చేదు నిజాలను ఆస్వాదించాలి. చివరగా ఇందులో ఒక కథ ముగింపులో చెప్పినట్లు "ఎండమావుల్లో నీరుండదనీ తెలుసుకోవాలంటే ఎడారిలో ప్రయాణించక తప్పదు". అందుకే "బ్రహ్మ సత్యం జగన్మిధ్య జీవో బ్రహ్మైవ నా పరః" -ఇదే అద్వైతం.

Browse more Telugu books