Matigari

Editor · Novels

Matigari book cover

Price: Rs. 108. వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ, ప్రజలను సంఘటితం చేస్తూ అడవిలో సుదీర్ఘకాలం ఉండిపోయిన దేశభక్తుడు వృద్ధుడై, తన దేశంలో వలస పాలన ముగిసిపోయిందనీ, దేశీయులే పాలిస్తున్నారనీ తెలిసి దేశంలోకి తిరిగివచ్చి చూస్తే కనబడిన హృదయ విదారక దృశ్యాలు, దోపిడీ పీడనలు ఎంత మాత్రం మారని దృశ్యాలు ఈ నవలకు భూమిక. పోరాట లక్ష్యాలు నెరవేరలేదనీ, పోరాటం కొనసాగించవలసిందేననీ, దాచిన ఆయుధాలు తిరిగి చేపట్టవలసిందేననీ ఆ తిరిగివచ్చిన దేశభక్తుడికీ, అణగారిన ప్రజలందరికీ అర్థమయ్యే సహజ సమాజ పరిణామాన్ని చిత్రించిన నవల ఇది. ఈ నవలా నాయకుడు నిజమైన మనిషే అనుకుని ఆయన అరెస్టుకు కెన్యా ప్రభుత్వం ఆదేశించింది. ఆయన దొరకకపోతే ఈ నవలనే నిషేధించింది.

Browse more Telugu books