Mathadin
Editor · History

Price: Rs. 55. దళిత రచనాకారుడు సూరజ్పాలాచౌహాన్ వారి సహజమైన, సజీవమైన రచనల ద్వారా దేశవిదేశ ప్రజలందరి హృదయాలను వారివైపు వారి రచనలవైపు ఆకర్షింప జేయడంలో సఫలీకృతులయ్యారు. రచనాక్షేత్రంలో దళిత సమాజంలో ఉన్నటువంటి చెడు సాంప్రదాయాలు దళిత సమాజంలోని మహామహులైనటువంటి దిగ్గజ సాహిత్య కారులెవరూ చేయలేని పనిని ఆయన తన కలంతో తొలగించేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. వాస్తవికమైన రచనా విధానంలో నిష్టగా ఉండి రచించడం కారణంగా అతి తక్కువ సమయంలోనే చౌహాన్ సాబ్ పేరు దేశ నలుమూలలా వ్యాపించింది. దళిత రచనాకారులు అనేకులు బౌద్ధ దర్శనం, బాబాసాహెబ్ డా॥ బి. ఆర్. అంబేడ్కర్ గారి దీక్షాదక్షతలను గురించి రాయడం నాకు తెలుసు కానీ వారి ఇల్లు, కుటుంబాల్లో పూర్తి కర్మకాండలు బ్రాహ్మణిజం ఆధారంగానే చేస్తారు, చేయిస్తారు. ఇటువంటి నకిలీ సమాజ సేవకులు కేవలం ఆడంబరాలను చూసి బౌద్ధులను సరాసరి చీవాట్లు పెడుతూనే ఉంటారు.