Marx Raasina Pettubadi

రాచమల్లు రామచంద్రారెడ్డి, ఎన్ వేణుగోపాల్ / Rachamallu Ramachandra Reddy, N. Venugopal · Politics

Marx Raasina Pettubadi book cover

Price: Rs. 180. 'ఏమిటీ, మార్క్స్ రాసిన పెట్టుబడి చదవడమే?! మూడు సంపుటాలు, అనుబంధంగా మరో మూడు సంపుటాలు, మొత్తం నాలుగు వేల పేజీలు! అమ్మో, చదవడానికి ఎంత సమయం కావాలి! అర్థం చేసుకోవడానికి ఎంత శ్రమ కావాలి!' అని చాలమంది అనుకోవచ్చు. భయపడవచ్చు. కాని, పెట్టుబడి కొరకరాని కొయ్య అనే అపోహను డేవిడ్ స్మిత్, ఫిల్ ఇవాన్స్లు ఈ పుస్తకంలో పటాపంచలు చేశారు. డేవిడ్ స్మిత్ పెట్టుబడిలో మౌలిక అంశాలను అత్యంత సులభంగా వివరించగా. ఫిల్ ఇవాన్స్ ఆ వివరణకు తగిన హాస్యస్ఫోరకమైన బొమ్మలు వేశారు. మార్క్స్ రాసిన మహాగ్రంథంలోని కీలక భావాలనూ, చమత్కారాన్ని, అపారమైన జీవశక్తినీ సంపూర్ణంగా పాఠకులకు అందించారు. మార్క్స్ పెట్టుబడి' రాసింది అర్థశాస్త్రవేత్తల, తత్వవేత్తల బీరువాలు అలంకరించడానికి కాదు. అది పెట్టుబడిదారీ విధానపు దోపిడీ పీడనలను వివరించడానికి! శ్రామికుల దృక్పథం నుంచి శ్రామికుల కొరకు రాసిన రాజకీయార్థ శాస్త్ర ఆయుధం, కార్మికవర్గపు విప్లవ రాజకీయాల మూలాలనూ పర్యవసానాలనూ వివరించే విశ్లేషణ. శ్రమ, వేతనాలు, నిరుద్యోగం, సరుకులు, యంత్రాలు, కార్ఖానాలు, డబ్బు, ధరలు, విలువ, అదనపు విలువ, దోపిడీ, పీడన, పెట్టుబడిదారులకూ కార్మికులకూ మధ్య వైరుధ్యం, ఆత్మగౌరవం కొరకూ, స్వేచ్ఛ కొరకూ, అధికారం కొరకూ కార్మికవర్గం చేసే పోరాటం, సోషలిజం అనివార్యత వంటి ఎన్నో అంశాలను వివరించే పుస్తకమిది. 1867లో రాసిన 'పెట్టుబడి' ఇవాళికీ తాజాగా, ఇవాల్టి విషయాలు వివరిస్తున్నట్టే ఉంటుంది. ఇప్పటికీ సమాజానికి ఆధారంగా ఉన్న మదుపునూ, లాభాన్నీ, శ్రమనూ, సాంకేతిక విధానాన్నీ 'పెట్టుబడి' విశ్లేషిస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల, దివాళా ఎత్తుతున్న ఆర్థిక వ్యవస్థల నేపథ్యంలో ఈ పుస్తకానికి మరింత ప్రాధాన్యత ఉంది.

Browse more Telugu books