Marks Capital Parichayam edi modhati samputam

Ranganayakamma · New Arrivals

Marks Capital Parichayam edi modhati samputam book cover

Price: Rs. 165. మానవులకు, 'మానవ సమాజం' గురించి తెలుసుకోడానికి మించిన జ్ఞానం వుండదు. ఆ జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రీయమైన గ్రంధం 'కాపిటల్' ఒక్కటే. మానవ సమాజం సృష్టించుకున్న విజ్ఞాన సంపదల్లో –19 వ శతాబ్దపు జర్మన్ తత్వ శాస్త్రమూ, ఇంగ్లీషు ఆర్థిక శాస్త్రమూ, ఫ్రెంచి సోషలిస్టు సిద్ధాం తమూ, అత్యంత ప్రధానమైనవి. ఆ మూడింటి లోనూ వున్న అశాస్త్రీయ, భావ వాద లక్షణాలను తొలిగించి, వాటిని, పూర్తిగా శాస్త్రీయమైన పునాదుల మీద నిలబెట్టిన దాని ఫలితమే 'మార్క్స్ సిద్ధాంతం'! 'కాపిటల్' ఆవిర్భావం మానవ సమాజ చరి త్రలో అత్యద్భుతమైన ఘటన. గత లక్షలాది సంవ త్సరాలలో జరిగిన ఘటనల కన్నా అది భిన్నమైనది. ఎందుకంటే — మానవ ప్రపంచానికి దాస్య శృంఖలాల నించీ; 'దోపిడీ' అనే అమానుషత్వం నించీ; జుగుప్సాకరమైన వర్గ భేదాల నించి కౄరాతి కౄరమైన యుద్ధాల నించీ: సంక్షోభాల నించి: యుగ యుగాల దుఖాల నించీ, కన్నీళ్ళ నించీ: జంతు స్థాయి హింస నించీ: అజ్ఞానం నించి-శాశ్వతంగా విముక్తి నిచ్చే మార్గాన్ని 'కాపిటల్' అనే జ్యోతి విస్పష్టంగా చూపించింది. అందులో చాలా 'ఆర్థిక శాస్త్రం' అంటే లెక్కలు వుంటాయనీ, లెక్కలు బాగా తెలిసిన వాళ్ళు తప్ప దాన్ని చదవలేరనీ, సాధారణంగా మనం దరికీ ఒక అభిప్రాయం వుంటుంది. అది చాలా పొరపాటు అభిప్రాయం. ఆర్థిక శాస్త్రం అంటే, సమాజపు ఉత్పత్తి విధానాన్నీ, పంపిణీ విధానాన్నీ వివరించే శాస్త్రం. అందులో పెద్ద పెద్ద లెక్కలు వుండవలసిన అవసరం లేదు. ఇందులో ఉన్నదంతా లెక్కలు కాదు, తర్కం, లెక్కలంత ఖచ్చితమైన తర్కం. అంటే, హేతుబద్ధ మైన చర్చ. ఈ పుస్తకం చదవడానికి, పెద్ద పెద్ద డిగ్రీలూ, పాండిత్యాలూ అక్కర్లేదు. అవి వుంటే నష్టం లేదు గానీ, లేకపోతే కూడా నష్టం లేదు. ఈ పుస్తకం చదివే వ్యక్తికి ఒక లక్షణం తప్పని సరిగా వుండాలి. 'ఆలోచించే' లక్షణం. చాలా పుస్త కాల విషయంలో, చదివే వాళ్ళకి ఆలోచన అక్క ర్లేదు. తలకాయని తీసి ఎక్కడన్నా తగిలించి, విశ్రాంతిగా పడుకొని పుస్తకం చదువుకోవచ్చు. కానీ, ఇక్కడ అది పనికి రాదు. ఇక్కడ అడుగడుగునా తర్కమే. పాఠకులు పాల్గొనకుండా, రచయిత తర్కం చేయలేడు. ఆలోచించని పా

Browse more Telugu books