Manushulra Manushulu!

Editor · Stories & Poetry

Manushulra Manushulu! book cover

Price: Rs. 170. యాకూబ్ కవిత్వాన్ని నిర్దిష్ట బంధనాలకు లోబడని డిపర్సనల్ మోనోలాగ్ అనొచ్చు. అస్పష్ట లయాత్మక వెర్బల్ జగరీ రహిత మెటీరియా పోయెటికా అని అనొచ్చు. వర్తమాన గతంలా ఆవిష్కృతమయే దివ్యదృష్టీకరణ అని కూడా అనొచ్చు. ఏ పేరుతో పిలిచినా యాకూబ్ కవితలన్నీ నిశ్శబ్ధంగా తలలూపుతాయి. ఏది ఏమన్నా, ఏది ఎలా విశ్లేషించినా అంతా మనిషి మీద ప్రేమే కదా అన్నపుడు నిలువునా కరిగిపోతాయి, కదిలిపోతాయి. అందుకే కామోసు కవితలన్నింటినీ 'మనుషుల్రా మనుషులు' అనే శీర్షిక కింద చేర్చాడు. Aptronym. ఎందుకంటే మనిషికి పర్యాయపదం యాకూబ్ కవిత్వం. మనిషి కోసం తపన యాకూబ్ కవిత్వం. యాకూబ్ ఇప్పటి వరకూ రాసిందీ ఇప్పుడు రాసిందీ వేర్వేరు. ఇది అంతకు మించి. - ప్రసేన్

Browse more Telugu books