Manto
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 155. 1937లో లాహోరులో పుట్టిన డా.నరేంద్ర మోహన్గారు ప్రతిభా సంపన్నులు. భావుకుడు. మేధావి. 'మంటో' అనే కలం ఒక 'కల్పవృక్షం.' ఈ కల్పవృక్ష బీజాన్ని వారు వివిధ దృష్టి కోణాలతో పరిశీలించారు. 'అక్షరాగ్ని' మంటో మనస్సులోని ఏడు పొరలను, వారి రచనలను లోతుగా పరిశీలించి ఆయన వ్యక్తిత్వాన్ని, కృతిత్వాన్ని పాఠకుల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. సారస్వత వనంలో 'వటవృక్షమైన నరేంద్ర మోహన్ 'కల్పవృక్షం' సాదత్ హసన్ మంటో ఈనాటి సమాజానికి ఎంత అవసరమో తెలియచెప్పారు. వారి శ్రమ సౌందర్యం ఈ జీవిత చరిత్రలో మనకు కనిపిస్తుంది. సాదత్ సాహిత్య సాగరాన్ని ఒక కుండలో నింపడం సాధ్యపడుతుందా? పుస్తకం చదవండి. మీరే నిర్ణయించండి. డా. టి.సి.వసంతగారు తన స్వంత, అనువాద రచనల ద్వారా సారస్వత సేవ చేస్తున్నారు. 'కలలు కనండి పండించుకోడానికి ప్రయత్నం చేయండి.' ఇది ఆవిడ ధ్యేయం. 'అక్షరకాంతి' మనకు తోడునీడగా ఉంటే మనస్సు మరుభూమిగా మారదు అని ఆవిడకి నమ్మకం. ఈ వృద్ధాప్యంలో కీ.శే. గుడిపాటి వెంకటా చలంగారి జీవిత చరిత్ర హిందీలో 'రమణీసే రమణాశ్రమ్ తక్' అన్న పేరున 1400 పేజీలు (3 భాగాలు) రాయడం తనకెంతో గర్వకారణంగా భావిస్తారు.