Mandara Makarandalu

P. Rajeswara Rao / పి. రాజేశ్వరరావు · Novels

Mandara Makarandalu book cover

Price: Rs. 45. మహాభాగవతం గురించిగాని, కవిలోక శిఖామణి పోతనగారి గురించిగాని తెలుగు పాఠకులకు కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు. నన్నయ, తిక్కనాదులు భాగవతాన్ని తెనిగింపక వదలుట తన భాగ్యమని పోతనగారే స్వయంగా చెప్పుకున్నారు. కాని ఇది నిజంగా తెలుగువారి భాగ్యం. భాగవతం పోతనగారిచేతిలో పడి వుండనిచో మనకు అమృత గుళికల వంటి పద్యాలు లభించి వుండేవి కావు. పోతన కవిత్వాన్ని గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే ఎవరైనా సరే 'మందార మకరంద మాధుర్యం' అనక తప్పదు. వందేళ్ళక్రితం తెలుగువారి విద్యాభ్యాసం పురాణ గ్రంథాల పఠనంతో ప్రారంభమయ్యేదట. భారతం, రామాయణం, విరాటపర్వం, సుందరకాండ, సత్యహరిచంద్ర, పాండవోద్యోగం, రుక్మిణీకల్యాణం, గజేంద్రమోక్షం మొదలగు గ్రంథాలు విద్యార్థులకు పాఠ్యగ్రంథాలుగా వుండేవట. నేటికీ వివాహంకాని ఆడపిల్లలు 'రుక్మిణీ కల్యాణం' చదివితే వివాహం అవుతుందనే నమ్మకం తెలుగువారిలో బలంగా వుంది. అప్పట్లో తెలుగు చదువరులకు, విద్యార్థులకు వందలకొలది పద్యాలు కంఠస్థములై వుండేవి. ఇటీవల కాలంలో తెలుగు పద్యం, నిరాదరణకు, నిరాసక్తతకు గురియగుచున్నది. బుద్ధి వికాసానికి, సత్ సంస్కృతికి పద్యాలు పట్టుకొమ్మలు. కొండంత విషయాన్ని నాలుగు పాదాలలో చెప్పగలిగే సత్తా ఒక్క పద్యానికే వుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Browse more Telugu books