Manavathapai Dhadi
Editor · Politics

Price: Rs. 90. వాజీలపై నాటి న్యూరేన్బర్గ్ విచారణ అటుంచి ఫాసిస్టు చర్యల కారకులపై నూటికి పాశ్చాత్య దేశాల్లో విచారణ జరుగుతూనే వుంటుంది. యాభై ఏళ్లనాటి ఇప్పటికీ విమర్శిస్తుంటాము. వందల ఏళ్లనాడు ఆలయాలు కూల్చారనే ఆపణలతోఈ పాలక పక్షీయులు కేసులు పెడితే తీర్పులు వస్తుంటాయి. అలాంటప్పుడు ఇరవయ్యేళ్ల గుజరాత్ నరమేధంలో నేరస్తులను మర్చిపోవాలన్న సంకేతం, పోరాడేవారిపైనే వ్యతిరేక ముద్రలు వేయడం సుప్రీం నుంచి ఆశించేదేనా? సెతల్వాద్ తదితరుల అరెస్టులు దేశంలోనే గాక అంతర్జాతీయ వేదికలపైన నాడా నిరసనకు దారి తీశాయంటే కారణమదే. దీన్ని నిరసిస్తూ మాజీ న్యాయమూర్తులతో సహా 300మంది సీనియర్ న్యాయకోవిదులు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణకు లేఖ రాసినా స్పందనలేదు. సిట్ నివేదిక అంతిమం అంటే రాజ్యాంగం ఏమయ్యేట్టు? అందుకే జరగాల్సింది తీస్తాసెతల్వాడ్ను విడుదల వేయడం. దోషులను శిక్షించడం. లేకపోతే భవిష్యత్తులో బాధితుల తరపున హక్కుల కోసం ముందుకు వచ్చేవారిపై ఇది బెదిరింపు అస్త్రంలా మారుతుంది.