MANAVA VAADAM-JEEVANAADHARAM

Editor · Best Selling

MANAVA VAADAM-JEEVANAADHARAM book cover

Price: Rs. 200. ఎవడికి తోచింది వాడు ఆలోచించుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దాన్ని ఇతరులపై ప్రయోగించే స్వేచ్ఛ ఎవరికి ఉండదు. నీ ఆలోచన, నీ పక్కవాడికి, నీ సమాజానికి, నీ దేశానికి, మొత్తం ప్రపంచానికి పనికొచ్చేదై ఉన్నప్పుడు దానికి అందరి ఆమోదం లభిస్తుంది. స్వేచ్ఛ అంటే అరాచకత్వం కాదు. అనాగరిక ధోరణీ కాదు. నీ ఇష్టా ఇష్టాల్ని ఇతరులపై బలవంతంగా రుద్దడం కాదు. సంయమనంతో సర్వ మానవాళి శ్రేయస్సు కోసం ఉపయోగపడేది. ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవరాజు మహారాజు గత ఏభైఏళ్లకు పైగా రచనలు ప్రకటిస్తూనే ఉన్నారు. అన్ని సాహితీ ప్రక్రియల్లో డెబ్భైయారు ప్రామాణిక గ్రంథాలను వెలువరించిన ఈ రచయిత, ఐదు జీవన సాఫల్య పురస్కారాలను అందుకున్నారు. అందులో ఒకటి మూఢనమ్మకాల నిర్మూలనకు. తన కలం కొరడా ఝుళిపిస్తూ సమాజంలో హేతుబద్ధత, సామాన్యుడిలో శాస్త్రీయ ఆవగాహన పెరగాలని నిరంతరం తపిస్తున్న నిత్యకృషీవలుడు. ఆ కోవలో రచించినదే ఈ రచన. అదే ఈ ప్రచురణ.

Browse more Telugu books