MANASU
Editor · Novels

Price: Rs. 135. మానసిక ఆరోగ్యం విషయంలో సమాజ నిశ్శబ్దాన్ని ఛేదించడానికి ఈ ఇద్దరు రచయితలు అద్భుత ప్రయత్నం చేశారు. ప్రస్తుత సాంకేతిక విప్లవ కాలంలో సమాజం ఎదుర్కొంటున్న డిజిటల్ అడిక్షన్, సహజీవనం, కాగ్నిటివ్ బర్డెన్ వంటి సున్నితమైన అత్యవసరమైన నూతన అంశాలను కూడా చక్కగా వివరించారు. డిజిటల్ డైట్ అనే అంశాన్ని పరిచయం చేయడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వినూత్న మార్గాన్ని చూపించారు. మానసిక సమస్యలపై సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఇంత సులభంగా అన్ని విషయాలను వివరించే పుస్తకం నాకు తెలిసినంతవరకు ఇదే మొదటిది. శైశవం నుండి వృద్ధాప్యం వరకు జీవన ప్రయాణంలో ఎదురయ్యే మానసిక సమస్యలపై ప్రతి వ్యక్తికి అవగాహన కల్పించాలనే రచయితల తపన ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తున్నది. సహజీవనం వంటి ప్రస్తుత విషయాలతో పాటు వివాహ సంబంధాలు వాటి సమస్యలను శాస్త్రీయ విధానంలో వివరించారు. ఇది ఎంతో సాహసంతో కూడుకున్న విషయం.