Mana Mahamahulu
Chikolu Sundaraiah / చికోలు సుందరయ్య · Biographies & Auto Biographies

Price: Rs. 225. ఆధునిక సాహిత్యం బహుముఖీనంగా సాగుతోంది. సమాచార సాహిత్యం, విశ్లేషణా సాహిత్యం, పరిచయ సాహిత్యం, జీవిత చరిత్రలు..... ఇలా ఆధునిక సాహిత్యం అనిపించుకుంటున్న అన్ని సాహిత్య రంగాల్లో తనదంటూ ఒక కొత్త ముద్రవేసిన రచయిత చీకోలు సుందరయ్య. ఆయన కలంనుంచి ప్రసిద్ధ దిన, వార, పక్ష, చీకోలు సుందరయ్య మాస పత్రికల్లో వెయ్యికి పైగా ఇంటర్వ్యూలు, వివిధ సాహిత్యాంశాలపై వందల వ్యాసాలు, కథలు, కథానికలు, కవితలు, విశ్లేషణలు, వినియోగదారుల విజయాలు ఇలా ఎన్నో వచ్చాయి. సంపాదకుడిగా 50కి పైగా కవితల, కథల, వ్యాసాల సంకలనాలున్నాయి. తెలుగువారి నిలువెత్తు సంతకమైన పీ.వీ. సరసింహారావు మీద పీవీ మన ఠీవి' పేరుతో సంక్షిప్త జీవితచరిత్ర అందించారు. అది రెండు ముద్రణలు పొందింది. డా.కె.వి.రమణాచారి వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని 'ప్రజలు.. ప్రభుత్వం.. ఒక ఐఏఎస్"గా నవ్య వారపత్రికలో సీరెయల్గా రాసి రమణ అభిమానులకు చేరువయ్యారు. అలాగే రమణాచారి మీద అరవైమంది.. సంస్పందనలతో మా రమణ' ప్రచురించారు. 2020లో 'ఒక గురువుగారు నలుగురు శిష్యులు' అందించారు. అది విమర్శకుల ప్రశంసలందుకుంది. 2002 నుంచి 2005 వరకు నాలుగు సంవత్సరాల పాటు 'ఈనాడు దినపత్రిక, అంతర్రాష్ట్ర సంచికల్లో ప్రతిరోజూ రాసిన కాలమ్ నుంచి పాఠకులకు ఆసక్తి కలిగించే అంశాలను 'తరతరాల తెలుగు విశేషాంశాలు, సాహిత్యాంశాలు పేర్లతో రెండు భాగాలుగా విభజించి 2022లో ప్రచురించారు. కాలంలోనే 1 2 3 తెలుగు పుస్తకాలను పరిచయం చేశారు. వాటిని చదివిచూద్దాం శీర్షికన ప్రచురించారు. ఆయనలోని వైవిధ్యాభిలాషకు ఈ "చదివి చూద్దాం" శీర్షిక కోసం ఎంచుకున్న పుస్తకాలే నిదర్శనం. అలాగే ఆయన కొన్ని వందల మందిని తన కాలంలో పరిచయం చేశారు. అందులోంచి వందమందిని గురించి రాసిన వ్యాసాలతో ఈ... "మన మహామహులు" ఇప్పుడు ప్రచురించారు. సాహిత్యంలో కొత్తదనం కనపడితే ఆనందంగా హత్తుకోవడం సుందరయ్యకు చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలను ఒడిసిపట్టుకోవడం, వాటికి తనవంతుగా ఔచిత్యమైన మార్పులను చేస్తూ ఉండడం అంటే సుందరయ్యకు సరడా! పాఠకులకు అన్ని విడమర్చి చెబుతున్నట్లు అనిప