Mana Jeevithalu 1, 2, 3
జిడ్డు కృష్ణమూర్తి / Jiddu Krishnamurti · Books

Price: Rs. 621. 1895లో మదనపల్లిలో జన్మించిన జె. కృష్ణమూర్తి దాదాపు 60 సం||లు అనన్యమైన తీరుతో ప్రసంగిస్తూ ప్రపంచమంతటా పర్యటించిన విశ్వవిఖ్యాత తాత్త్వికుడు. తనను తాను తెలుసుకొనే సత్యాన్వేషణే మానవునికి స్వేచ్ఛను ప్రసాదించి నవ్య నూతన సమాజాన్ని ఆవిర్భవింపజేస్తుందని బోధించారు. సత్యాన్ని చేరడానికి ఏ మతాల, సంస్థల, గురువుల తోడ్పాటు అవసరం లేదని వక్కాణించారు. 1940-50లలో యూరప్, అమెరికా, ఇండియాలలో విస్తృతంగా పర్యటిస్తున్నపుడు కృష్ణమూర్తిని కలిసి సంభాషించిన వారి ఇంటర్వ్యూలను కొన్నింటిని ఈ బృహత్ సంపుటిలో పొందుపరిచాము. కృష్ణమూర్తిని చూడగానే మనలాంటివారే ఎందరో తమ సమస్యలను చెప్పుకునేవారు. తమ సందేహాలను, ఆశనిరాశలను, తమ అంతరంగపు అగాధాలలోని అనేక అంశాలను ఏ దావరికమూ, సంకోచమూ లేకుండా వ్యక్తీకరించేవారు. కృష్ణమూర్తి వారి నిగూఢమైన అంతరంగపు లోతులను తరచి శోధించి తేటతెల్లం చేసిన ఉదంతాలు ఈ పుస్తకంలో పొందుపరచి వున్నాయి. అదే కృష్ణమూర్తి బోధనలలోని విశిష్ట సారాంశం. అపారమైన అంతర్దృష్టి, అపూర్వమైన రచనాశైలిలో సాగిన ఈ రచనలు, చదివినవారిని చైతన్యవంతులను చేస్తాయి. ప్రతి పాఠకునికీ ఎక్కడో ఒకచోట తననితాను అద్దంలో చూసుకున్నట్లు అనిపించడం తథ్యం.