Mana Cinema First Reel

Editor · Cinima

Mana Cinema First Reel book cover

Price: Rs. 675. ఈ రచనలో ఎంతో పరిశోధన ఉంది. పరిశ్రమ ఉంది. చరిత్రను అందంగా, ఆసక్తిగా చదివించే వైనం ఉంది. ప్రభుత్వాలు, యూనివర్సిటీలు చేయాల్సిన పని ఒంటి చేతితో రెంటాల జయదేవ చేశారు. ఇది మన సినీచరిత్రకు ఆయన చేసిన మహోపకారం! ఈ అపూర్వ రచనను అన్ని భారతీయ భాషల్లోకీ ట్రాన్స్లేట్ చెయ్యాలి. - సింగీతం శ్రీనివాసరావు, దర్శకుడు దక్షిణాదిలో వివిధ భాషల సినీ పరిశ్రమల పుట్టుక, వాటిలో తెలుగువాళ్ళ పాత్ర తెలుసుకోవాలంటే ఈ రచన చదవాల్సిందే! డాక్టరేట్లు ఎలా వస్తాయో తెలీదు గానీ... డాక్టరేట్కు అర్హమైన గొప్ప పరిశోధనా గ్రంథం చదువుతున్నట్టు అనిపించింది. - ఎస్.ఎస్. రాజమౌళి, దర్శకుడు భాషల ఎల్లలు చెరిపిన అఖిల భారత రచన ఇది. సినీ చరిత్రను ఇలా రాయడం ముఖ్యం. మన సెల్యులాయిడ్ డాక్యుమెంటేషన్పై ఇది సరైన ఫోకస్ లైట్. ఎంతో కల్చరల్ ఇంపార్టెన్స్ ఉన్న లిటరరీ డాక్యుమెంటేషన్! ఒక విశిష్ట ప్రయత్నం, విజ్ఞాన భండారం! -ప్రకాశ్ రాజ్, నటుడు

Browse more Telugu books