Mallemoggala Godugu

Endluri Sudhakar / ఎండ్లూరి సుధాకర్ · Books

Mallemoggala Godugu book cover

Price: Rs. 135. యెండ్లూరి సుధాకర్ 'మల్లెమొగ్గల గొడుగు' జవజీవాలున్న ఓ సజీవ కధల సంపుటి. ఇందులో మాదిగలు తమ జీవితాల గురించీ, తమ ప్రేమలు, బాధలు, నిబ్బరాలు, నైపుణ్యాలు, దు:ఖాల గురించీ వివరిస్తారు. తన కాలంలో బుద్ధుడు ఎలా నడిచాడో వీరి గమనమూ అలాగే ఉంటుంది. మాదిగల జీవితం గతానికి సంబంధించింది కాదు, అది భవిష్యత్తుకు సంబంధించింది. యెండ్లూరి సుధాకర్ అర్థంతరంగా మనల్ని వదిలి వెళ్లిపోయినప్పటికీ ఈ కథలు స్ఫూర్తిమంతమైన ఆయన జీవితాన్నీ, ఆయన కథన సామర్థ్యాన్నీ మన కళ్ల ముందు ఆవిష్కరిస్తాయి. ఇవన్నీ ఆయన ఊహల్లోంచి పుట్టిన కాల్పనిక కథలు కావు, తోటి మాదిగలు ఆయనతో పంచుకున్న జీవితానుభవాలు. - కంచ ఐలయ్య షెపర్డ్, రచయిత మన మనసుల్ని కట్టిపడేసి, ఏక బిగిన చదివించే అద్భుతమైన పుస్తకమిది. ఒకవైపు కుల దౌష్ట్యాలనూ, మరోవైపు ఆధునిక సమాజం విసురుతున్న సవాళ్లనూ గుండె ధైర్యంతో ఎదుర్కొంటూనే ఎప్పటికప్పుడు తనను తాను బలంగా పునర్నిర్వచించుకునే కమ్యూనిటీ అనుభవాలను అతి దగ్గరగా చూపించే రచన ఇది. వీరంతా తాము ఎదుర్కొంటున్న అణచివేతను, తమ జీవన పరిస్థితులను.. ఎక్కడా నిరాశకు, ద్వేషభావాలకు తావివ్వకుండా అలవోకగా ప్రతిఫలిస్తారు. నిచ్చెన మెట్ల కులవ్యవస్థ కారణంగా నిరంతరం దుర్భర హింసనూ, అమానవీయ అనుభవాలనూ ఎదుర్కొంటూ కూడా.. ఇందులో తారసపడే ప్రతి ఒక్కరూ పరిపూర్ణ మానవుల్లా కనిపిస్తారు. ఈ పుస్తకాన్ని చదువుతుంటే, దట్టమైన చీకటి రాత్రి వేళ ప్రకాశవంతమైన నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. చీకటి అంతటా కనబడుతూనే ఉంటుంది గానీ అది మనల్ని ఏరకంగానూ భయపెట్టలేదు. - జె. దేవిక, మళయాళ రచయిత్రి

Browse more Telugu books